‘క్రాక్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Actress Shruti Haasan, Krack, Krack Movie Release, Krack Telugu Movie Updates, Latest Tollywood News, Ravi Teja Krack Movie Release, Ravi Teja Krack Movie Release Date, Ravi Teja Movies Latest News, Ravi Teja New Movie, Ravi Teja’s Krack Movie release date locked, Shruti Haasan, Shruti Haasan New Movie Krack, Shruti Haasan Upcoming Movie Krack, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

కరోనా కారణంగా ఇన్ని రోజులు థియేటర్స్ మూతబడ్డాయి. ఇక ఇన్ని రోజులు డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ వచ్చే సంక్రాంతికి మాత్రం పెద్ద ఎత్తున సందడి నెలకొనేలా కనిపిస్తుంది. చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సంక్రాంతికి రెడీ అవుతుంది. అదే క్రాక్ సినిమా. మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థమన్ తన ట్విట్టర్ ద్వారా.. క్రాక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జరుగుతుంది.. త్వరలోనే `క్రాక్` థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్ లో రానుంది అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీ హాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. స‌ముద్ర‌ఖనీ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘మెర్సాల్‌’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =