రెండేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియనుమ్’ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుండగా ఈ సినిమాలో పవన్ తో పాటు రానా నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాత రానా కాదు నితిన్ నటించనున్నారు అంటూ టాక్ వచ్చింది. ఆ తర్వాత సుదీప్ అన్నారు. అయితే ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కు క్లారిటీ వచ్చేసింది. దీనిపై తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ ప్రకటన ఇచ్చింది. ఈ సినిమాలో రానా నటిస్తున్నట్టు సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇక దీనిపై సంతోషం వ్యక్తం చేసిన రానా షూటింగ్లో పాల్గొనేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని ట్వీట్ చేశారు. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా నటించనున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























