కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollwood News

ట్యాగ్ · 62 కథనాలు · పేజీ 3

Ismart Shankar Movie Actress Nidhi Agarwal Distributes Food Packets To Migrant Workers
సినిమా వార్తలు

వలస కార్మికుల కోసం నిధి అగర్వాల్

బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొందిన నిధి అగర్వాల్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ, జయం రవి హీరోగా రూపొందుతున్న "భూమి " తమిళ మూవీ లో నటిస్తున్నారు. "భూమి " తమిళ మూవీ తో నిధి కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సినిమాలో నేను లేను.. అందులో నిజం లేదు..!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు తెరపై మరో బయోపిక్ - ఈసారి 'కరణం మల్లీశ్వరి' పై

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో మరో బయోపిక్ తెరపైకి వచ్చింది. క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ ను రూపొంద‌నున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"జిగర్తాండ" హిందీ రీమేక్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ?

గ్రూప్ కంపెనీ బ్యానర్ పై కథిరేసన్ నిర్మాతగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్ , బాబీ సింహా ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "జిగర్తాండ" తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. "జిగర్తాండ" తమిళ మూవీ తెలుగు రీమేక్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, అథర్వ ప్రధాన పాత్రలలో రూపొందిన "గద్దలకొండ గణేష్"మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు "జిగర్తాండ" తమిళ మూవీ హిందీ లో రీమేక్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక పై సమంత ప్రశంసలు

బ్లాక్ బస్టర్ "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా రూపొందిన "పొగరు "(కన్నడ ), "సుల్తాన్" (తమిళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "సుల్తాన్" తమిళ మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గొప్ప నటుడిగా.. మంచి తండ్రిగా.. గొప్ప భర్తగా గుర్తుపెట్టుకోవాలని నా కోరిక..!

ఇన్ని రోజులు తమ హీరో సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మహేష్ తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. తన తర్వాత పరుశురాం దర్శకత్వంలో ఉండబోతుందని చెప్పిన చిత్రయూనిట్... నిన్న సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నిన్న మహేష్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ పలు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. మరి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్

మొత్తానికి అనుకున్నదే జరిగింది. రానా-మిహికాల పెళ్లి డిసెంబర్ లో పెళ్లి అనుకుంటున్నారు కానీ రానా స్పీడ్ చూసి డిసెంబర్ కంటే ముందే జరగొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అదే జరిగింది. రానా పెళ్లి ముహుర్తాన్ని ఫిక్స్ చేసేశారు. ఆగస్టు 8న వీరి వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇరువురి కుటుంబ పెద్దలు ఆ రోజున మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారట. ఈ సందర్భంగా రానా తండ్రి సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘అవును... మా అబ్బాయి పెళ్లి ఆగస్టు 8న ముహూర్తం ఫిక్స్ చేసాం.. మంచి ముహూర్తం కుదిరింది. హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక ఉంటుంది. కరోనా కారణంగా ఎక్కడికీ వెళ్లడానికి లేదు కాబట్టి.. ప్రభుత్య…

TFN Adminవాట్సాప్
Telugu FilmNagar wishes superstar Krishna a very Happy Birthday,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2020,Tollwood Movie Updates,Latest Tollwood News,superstar Krishna,superstar Krishna Latest News,superstar Krishna New Movie Ne
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణకు ఆ గౌరవం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పటికో...!?

మే 31... సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు... ఈ సందర్భంగా మీడియా అభినందన వ్యాసాలు రాస్తాయి. కృష్ణ చలన చిత్ర జీవిత విశేషాలను పునరావృతంగా కీర్తిస్థాయి. అయితే ప్రస్తుత సందర్భంలో కావాల్సింది అందరికీ తెలిసిన ఆయన ఘనతను కీర్తించడం కాదు. ఆయన ఘనతకు తగిన ఒక జాతీయ పురస్కారం ఆయనను వరించేందుకు అవసరమైన ప్రాతినిధ్య వ్యాసాలు రాయటం అవసరం.

Team TFNవాట్సాప్
Director Sukumar Bunny New Movie Titled Pushpa
సినిమా వార్తలు

బన్నీ - సుకుమార్ సినిమా టైటిల్ గా 'పుష్ప'...?

బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. మరి స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందంటే.. ఇక ఆ సినిమాకు సంబంధించిన పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి కదా. అలానే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఈ సినిమాకు 'శేషాచలం' అన్న టైటిల్ అనుకుంటున్నట్టు రూమర్లు వచ్చాయి. అయితే ఆ రూమర్లను అప్పుడే కొట్టిపడేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`బాహుబ‌లి - ది కంక్లూజ‌న్` విడుద‌ల తేదికి అల్లు అర్జున్ చిత్రం?

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి రావ‌డ‌మే కాకుండా, కెరీర్ బెస్ట్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అలాగే వ‌సూళ్ళ ప‌రంగా `నాన్ - బాహుబ‌లి` రికార్డు అందుకున్నాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్` రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసుకున్నాడ‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్న పూరీ..!

లాక్ డౌన్ సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే... ఓ అగ్ర హీరో కోసం పూరీ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఆ అగ్ర హీరో ఎవరో కాదు.. మెగా స్టార్ చిరంజీవి. నిజానికి 150వ సినిమాను పూరీనే తెర‌కెక్కించాల్సి ఉంది. దీనికి ఆటోజానీ అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు పూరీ. అయితే స్టోరీ అంత నచ్చకపోవడంతో చిరు వెనక్కి తగ్గాడు. ఇప్పుడు మరోసారి.. చిరు కోసం పూరీ స్క్రిప్ట్ ను రాసే పనిలో వున్నాడట. అంతేకాదు తాజాగా అభిమానులతో మాట్లాడుతూ స్టార్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బన్నీ, సుక్కు... ఓ రెండ‌క్ష‌రాల టైటిల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా నటించిన ‘ఆర్య’తో తెలుగునాట‌ దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్. అంతేకాదు... మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు కూడా. అనంతరం బ‌న్నీ కాంబినేష‌న్‌లో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘ఆర్య 2’తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేశాడు. క‌ట్ చేస్తే... ప‌దేళ్ళ విరామం అనంత‌రం ముచ్చటగా మూడోసారి త‌న ల‌క్కీ హీరో కాంబోలో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధపడుతున్న సుక్కు... ఈసారి కూడా తన గత సినిమాల సెంటిమెంట్‌నే కంటిన్యూ చేయనున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాని పై పూజాహెగ్డే ప్రశంసలు

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే రీసెంట్ గా జార్జియా లో జరిగిన "Prabhas 20 మూవీ షూటింగ్ లో పాల్గొని ఇండియా తిరిగి వచ్చిన తరువాత స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే మీడియా తో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ ను సూపర్ గా వాడుకుంటున్న పూరీ..!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కేవలం నిత్యావసర సరుకులు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే తప్పా బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. చాలా మంది ఇంట్లోనే ఉంటూ కరోనా ఇచ్చిన సమయాన్ని కుటుంబంతో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ... ఫ్యామిలీతో... ఆట పాటలతో.. ఇంకొంతమంది గరిటె చేతబట్టి వంటలు చేస్తూ.. ఇలా పలు పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు హీరోలు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు తీస్తుంటే. మరికొందరు పాటల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక కొంతమంది దర్శకులు అయితే కొత్త స్క్రిప్టులకు పనిచెబుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ ను డైరెక్ట్ చేయాలనుంది..!

'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు ఫలక్‌నుమా దాస్ అదే యాక్టర్ విశ్వక్ సేన్. ఇక రీసెంట్ గా నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ?

దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ మూవీ తరువాత విజయ్ దేవరకొండ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack Movie Special Poster Is Out
ఫస్ట్ లుక్

"క్రాక్ " మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ అందించారు.

Team TFNవాట్సాప్
ANR Timeless Classic Mahakavi Kalidas Completes 60 Years
సినిమా వార్తలు

ఏయ‌న్నార్ అభిన‌య‌ప‌ర్వంలో క‌లికితురాయి ‘మ‌హాక‌వి కాళిదాసు’కు 60 ఏళ్ళు

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌రరావు న‌టించిన ప‌లు చారిత్రాత్మ‌క చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అలరించడమే కాదు... వాటిలో కొన్ని చిర‌స్థాయిగా నిల‌చిపోయాయి కూడా. అటువంటి చిత్రాల్లో ‘మ‌హాక‌వి కాళిదాసు’ ఒక‌టి. “పౌరాణిక బ్ర‌హ్మ” క‌మ‌లాక‌ర కామేశ్వ‌రరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఏయ‌న్నార్‌కు జోడిగా జూనియ‌ర్ శ్రీ‌రంజ‌ని న‌టించారు. య‌స్.వి.రంగారావు, సి.య‌స్.ఆర్, రేలంగి, వంగ‌ర‌, ముదిగొండ లింగ‌మూర్తి, రాజ‌సులోచ‌న‌, సంధ్య‌, వాసంతి త‌దిత‌రులు ముఖ్య భూమిక‌లు పోషించారు. క‌న్న‌డ మూవీ ‘మ‌హాక‌వి కాళిదాస’(1955)కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు ద‌ర్శ‌కులు క‌మ‌లాక‌ర కామేశ్వ‌రరావు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నంబ‌ర్ వ‌న్ స్థానంంలో “రాములో రాములా”

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `అల‌ వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని పాట‌ల‌న్నీ చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి. మ‌రీ ముఖ్యంగా... “రాములో రాములా” ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పెతురాజ్, జ‌య‌రామ్, ట‌బు తదిత‌రుల‌పై చిత్రీక‌రించిన ఈ పార్టీ సాంగ్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించింది. కేవ‌లం థియేట‌ర్ల‌లోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ గీతం సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

`ఆర్ ఆర్ ఆర్`... మే 20న య‌న్టీఆర్ స్పెష‌ల్ వీడియో?

కొమ‌రం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం ర‌ణం రుధిరం). ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్‌ని ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి... ఇటీవ‌ల మోష‌న్ పోస్ట‌ర్ ని, రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ వీడియోని విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. వీటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా, త్వ‌ర‌లో మ‌రో స్పెష‌ల్ వీడియోని రిలీజ్ చేయ‌డానికి ఫిల్మ్ మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్.

Team TFNవాట్సాప్

షేర్