రానా పెళ్లికి ముహూర్తం ఫిక్స్

Date Locked For Rana Daggubati Marriage
Date Locked For Rana Daggubati Marriage

మొత్తానికి అనుకున్నదే జరిగింది. రానా-మిహికాల పెళ్లి డిసెంబర్ లో పెళ్లి అనుకుంటున్నారు కానీ రానా స్పీడ్ చూసి డిసెంబర్ కంటే ముందే జరగొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అదే జరిగింది. రానా పెళ్లి ముహుర్తాన్ని ఫిక్స్ చేసేశారు. ఆగస్టు 8న వీరి వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇరువురి కుటుంబ పెద్దలు ఆ రోజున మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నారట. ఈ సందర్భంగా రానా తండ్రి సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘అవును… మా అబ్బాయి పెళ్లి ఆగస్టు 8న ముహూర్తం ఫిక్స్ చేసాం.. మంచి ముహూర్తం కుదిరింది. హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక ఉంటుంది. కరోనా కారణంగా ఎక్కడికీ వెళ్లడానికి లేదు కాబట్టి.. ప్రభుత్య నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో సింపుల్‌గా చేయాలనేది ప్లాన్‌’’ అని చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇటీవలే మిహికతో తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అలా బయట పెట్టాడో లేదో అలా అందరూ రానా కి పెళ్లా అంటూ చర్చించుకునే గ్యాప్ లోనే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని షాకిచ్చాడు. కొన్ని రోజుల క్రితమే రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబాల సమక్షంలో రానా-మిహికా ల నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఇక ఆ వేడుక అయిపోయిందో ;లేదో వెంటనే పెళ్ళికి ముహూర్తం పెట్టేసారు. ఏది ఏమైనా ఇన్ని రోజలు సైలెంట్ గా ఉన్న రానా అలా ప్రేమ విషయం బయట పెట్టాడో లేదో సూపర్ ఫాస్ట్ అయ్యాడని చెప్పొచ్చు.

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 7 =