మే 31… సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు… ఈ సందర్భంగా మీడియా అభినందన వ్యాసాలు రాస్తాయి. కృష్ణ చలన చిత్ర జీవిత విశేషాలను పునరావృతంగా కీర్తిస్థాయి. అయితే ప్రస్తుత సందర్భంలో కావాల్సింది అందరికీ తెలిసిన ఆయన ఘనతను కీర్తించడం కాదు. ఆయన ఘనతకు తగిన ఒక జాతీయ పురస్కారం ఆయనను వరించేందుకు అవసరమైన ప్రాతినిధ్య వ్యాసాలు రాయటం అవసరం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకూ ఆ జాతీయ పురస్కారం ఏమిటో… అందుకు సూపర్ స్టార్ కృష్ణ ఎలా అర్హులో వివరించడాన్నే ఆయన జన్మదిన ప్రత్యేక వ్యాసంగా అందిస్తుంది ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”.
భారతీయ చలనచిత్ర పితామహుడు దుండి రాజ్ గోవింద ఫాల్కే పేరున 1969లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠించిన “ దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్ ” ఇప్పటికీ ఏడుగురు తెలుగు సినీ దిగ్గజాలను వరించింది. మొట్టమొదటిసారిగా 1974లో ప్రముఖ దర్శక నిర్మాత బి.యన్.రెడ్డిని వరించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, తెలంగాణ నుండి వెళ్లి బాలీవుడ్ లో సంచలన దర్శక నిర్మాతగా హీరోగా ఎదిగిన పి. పైడిరాజును 1980లో వరించింది.
ఆ తరువాత 1982లో ప్రముఖ దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ ప్రసాద్, 1986లో ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి ,1990లో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, 2009లో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, 2016లో కళాతపస్వి కె.విశ్వనాథ్ గార్లను వరించింది ఫాల్కే అవార్డు. అయితే ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారానికి అన్ని విధాల అర్హులైన మరి కొందరు తెలుగు సినీ ప్రముఖులకు ఈ అవార్డు దక్కలేదు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన దివంగత దిగ్గజాలు నటరత్న నందమూరి తారక రామారావు ఒకరు కాగా మరొకరు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. ఆ ఇద్దరికీ ఈ గౌరవం దక్కకపోవడం అత్యంత బాధాకరం , శోచనీయం.
కాగా ప్రజెంట్ లివింగ్ లెజెండ్స్ లో సూపర్ స్టార్ కృష్ణ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్ని విధాలా అర్హులు అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఈ అవార్డు గురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి గట్టి ప్రాతినిథ్యం పంపించాలి… దాన్ని ఫాలో అప్ చేయాలి. ఇటీవల జరిగిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి అని ప్రత్యేకంగా ప్రస్తావించి డిమాండ్ చేయటం సంచలనం సృష్టించింది.
ఇక ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హమైన సూపర్ స్టార్ కృష్ణ ఘనత గురించి ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. 50 ఏళ్ల ఈ అవార్డు చరిత్రలో ఇప్పటివరకు దీనిని స్వీకరించిన ప్రముఖులలో ఎవరికి ఏ మాత్రం తీసిపోని సంచలనాత్మక చరిత్ర సూపర్ స్టార్ కృష్ణకు ఉంది అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయకుడిగా ఎదుగుతున్న క్రమంలోనే సొంత చిత్ర నిర్మాణ సంస్థ” పద్మాలయ ఫిలిమ్స్” స్థాపించి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలలో నలభైకి పైగా చిత్రాలు నిర్మించడం ద్వారా చిత్ర పరిశ్రమ ఉత్పాదక సామర్థ్యాన్ని విస్తృత పరిచిన సెన్సేషనల్ ఫిలిమ్ పర్సనాలిటీ సూపర్ స్టార్ కృష్ణ. వ్యక్తిగతంగా తాను అత్యధిక చిత్రాలలో హీరోగా నటించడం ద్వారా, first of its kind అనదగిన ఎన్నెన్నో సాంకేతిక ప్రయోగాలను పరిచయం చేయడం ద్వారా, ఎందరెందరో నూతన నటీ నట సాంకేతిక వర్గాన్ని పరిచయం చేయడం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకు హయ్యస్ట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన అతి కొద్ది మంది ప్రముఖులలో ఫస్ట్ లైనర్ గా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. నిజానికి తానొక సూపర్ స్టార్ గా కొనసాగుతూ జాతీయస్థాయిలో మరెందరో హీరోల స్టార్డమ్ కు ఊతంగా నిలిచిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మీ జయింట్ సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. ఇక దక్షిణాది నుండి వెళ్లి బాలీవుడ్ లో సంచలన చిత్ర నిర్మాణ సంస్థ గా విజయబావుటా ఎగురవేసిన పద్మాలయా సంస్థకు ఉత్తరాదిన గొప్ప పేరుంది. ఇలా ఉత్తర దక్షిణ భారత చిత్ర రంగాల ఉత్పాదక సామర్థ్యాన్ని విశేషంగా పెంచిన సూపర్ స్టార్ కృష్ణ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అన్ని విధాలా అర్హులు అన్నది నిర్వివాదాంశం.
కాబట్టి ఆయనకు ఈ అవార్డును ప్రధానం చేయాలి అనే ఎజెండాతో 2 తెలుగు ప్రభుత్వాలు, ఉభయ రాష్ట్రాల సూపర్ స్టార్ అభిమానులు, మీడియా ప్రాతినిధ్య ఒత్తిడిని పెంచవలసిన అవసరం ఉంది.
ఈ మేరకు ఒక కార్యాచరణ రూపొందించుకుని కేంద్ర ప్రభుత్వానికి గట్టి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అన్ని విధాలా అర్హులైన కృష్ణకు అవార్డు ఇవ్వటానికి ఇంత ఒత్తిడి అవసరమా అని ఎవరికైనా అనిపిస్తే అది పొరపాటు. ఎందుకంటే ఉత్తరాది డామినేషన్ తో పాటు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి కారణంగా
ఈ అవార్డు ఇప్పుడు చేజారి పోతే మరలా దక్షిణాదికి… అందులోనూ తెలుగు వారి వంతు వచ్చేసరికి
సంవత్సరాలు పడుతుంది.
కాబట్టి “ సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ” అన్నది ఒక డిజర్వింగ్ డిమాండ్ గా , ఒక నినాదంగా ప్రతిధ్వనించాలి. అదే సూపర్ స్టార్ కు మనందరం ఇవ్వగలిగిన బర్త్ డే గిఫ్ట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: