
ట్యాగ్ · 62 కథనాలు · పేజీ 4


పవన్ కళ్యాణ్ ‘జల్సా’కి 12 ఏళ్ళు

బన్నీ - సుక్కు మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అప్‌డేట్ ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి అచ్చొచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'ఆర్య`.. బన్నీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌లా నిలవగా, మలి చిత్రం 'ఆర్య 2' మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే... పదేళ్ళ తరువాత ఈ ఇద్దరూ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారిప్పుడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రధానంగా చిత్తూరు నేపథ్యంలో సాగుతుందట. బన్నీ కూడా చిత్తూరు యాసతో సరికొత్త లుక్‌లో సందడి చేస్తాడని టాక్. అంతేకాదు... ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బన్నీ తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ‘జల్సా’కి 12 ఏళ్ళు
తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది విజయవంతమైన జోడీ. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘జల్సా’. ఇలియానా, పార్వతి మెల్టన్ నాయికలుగా నటించిన ఈ సినిమాలో కమలిని ముఖర్జీ, ముకేష్ రుషి, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, అలి, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శివాజి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను... గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.