
ట్యాగ్ · 558 కథనాలు · పేజీ 10


"దసరా" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రభాస్ తో 'బాహుబలి 3' చేయాలని ఉంది..!
అల్లు అర్జున్ కు ఘన సన్మానం

నాని 'దసరా' నుండి క్రేజీ అప్ డేట్..!

మహేష్ తో మల్టీస్టారర్ కాదు.. రాజమౌళి క్లారిటీ..!

'రావణాసుర' సుశాంత్ బర్త్ డే పోస్టర్ రిలీజ్..!

టాలీవుడ్ హీరోలపై పూజాహెగ్డే కామెంట్స్

మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ?

నువ్వు గర్వ పడేలా చేస్తా నాన్న..!

స్పెయిన్ దేశంలో "కార్తికేయ 2 "మూవీ షెడ్యూల్

కృతి శెట్టి హోలీ స్పెషల్ ఫొటో

సమంత "యశోద "మూవీ అప్ డేట్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ “యశోద’” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీ ఫిమేల్ సెంట్రిక్ సినిమా అయినప్పటికీ ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని సమాచారం.

'రాధేశ్యామ్' డిలీట్ సీన్ల పై 'రాధాకృష్ణ' రియాక్షన్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. భారీ అంచనాల మధ్య ఈసినిమా మార్చి 11న రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో మంచి ప్రేమకథగా ఈసినిమా తెరకెక్కగా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించింది ఈసినిమా. ఇక చాలా రోజులు తరువాత ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ పాత్రలో కనిపించగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.

"దసరా" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ "శ్యామ్ సింగ రాయ్ " మూవీ తరువాత నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

"సర్కారు వారి పాట"సెకండ్ సింగిల్ "పెన్నీ" రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ప్రభాస్ తో 'బాహుబలి 3' చేయాలని ఉంది..!
తెలుగు, తమిళ్, హీందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతుంది పూజా హెగ్డే. అంతేకాదు వరుసగా హిట్లను కూడా తన ఖాతాలో వేసుకుంటూ సూపర్ ఫామ్ లో ఉంది. ఇక రీసెంట్ గానే రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.

'కె.జి.యఫ్ 2'.. 'తూఫాన్ లిరికల్ సాంగ్ రిలీజ్
సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. కె.జి.యఫ్ పార్ట్ 1 కు సీక్వెల్ గా ఈసినిమా వస్తుండగా.. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మైనింగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈసినిమాకు సౌత్ నుండి నార్త్ వరకూ అందరూ బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమా ఎప్పుడో అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉన్నా కరోనా వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఈసినిమా ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్ కు ఘన సన్మానం
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల తో పాటు ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్యి సుమారు 360 కోట్లు కు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అలియా లతో అమీర్ ఖాన్ "నాటు నాటు "సాంగ్ కు డ్యాన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

నాని 'దసరా' నుండి క్రేజీ అప్ డేట్..!
గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని చాలా రోజుల తరువాత బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికి సినిమా కూడా ఒకటి. కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. జూన్ 10న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేష్ తో మల్టీస్టారర్ కాదు.. రాజమౌళి క్లారిటీ..!
మహేష్-రాజమౌళి కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు.. మహేష్ ను ఎలా చూపిస్తాడు లాంటి విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అంతేకాదు ఈమధ్య కాలంలో మరో కొత్త వార్త కూడా చక్కర్లు కొట్టింది. రాజమౌళి మహేష్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి.

'పుష్ప' క్రేజ్.. 10 మంది 'పుష్పరాజ్' లు ఒకేసారి..!
ఇప్పట్లో ఒక సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టడమంటే మాములు విషయం కాదు. ఒక వేళ హిట్ అయినా కూడా ఆసినిమా గురించి కొద్ది రోజులు మాట్లాడుకొని తరువాత మర్చిపోతారు. కానీ పుష్ప మేనియా మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఈసినిమా రిలీజ్ కు ముందూ రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ ఓ సంచలనమే. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి పాట హుక్…

'రావణాసుర' సుశాంత్ బర్త్ డే పోస్టర్ రిలీజ్..!
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో సుశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు కళ్ళతో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. దీనిని బట్టి ఆయన పాత్ర వైవిధ్యంగా వుంటుందని అర్థమవుతోంది.

టాలీవుడ్ హీరోలపై పూజాహెగ్డే కామెంట్స్
హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజా హెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్…

మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక మూవీ , పూరి జగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "జనగణమన" మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

శ్రీవారి సన్నిధి లో "#NBK107 "మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్
బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

నువ్వు గర్వ పడేలా చేస్తా నాన్న..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. కీర్తిసురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మహేష్ సినిమా వచ్చి చాలా కాలం అయిపోతుండటంతో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తి దశకు వచ్చేసింది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మరోపక్క స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. ఈసినిమా నుండి వరుసగా పాటలు రీలిజ్ చేస్తున్నారు. ఇప్పటికే కళావతి పాటను రిలీజ్ చేయగా సెకండ్ సాంగ్ ను 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో సెకండ్ పాటకు సంబంధించి ప్రోమోను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

స్పెయిన్ దేశంలో "కార్తికేయ 2 "మూవీ షెడ్యూల్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ "కార్తికేయ 2 "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న "కార్తికేయ 2 "మూవీ లో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నారు."కార్తికేయ 2 "మూవీతో పాటు నిఖిల్ , అనుపమ "18 పేజెస్ "మూవీ లో జంటగా నటించారు.

క్రికెటర్ 'సుందర్ వాషింగ్టన్' కు 'సుందరం' బెస్ట్ విషెస్..!
దాదాపు రెండేళ్ల తరువాత ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాడు నాని. ఈసినిమాతో సాలిడ్ హిట్ ను కూడా అందుకున్నాడు నాని. ఇక ఇప్పుడు తన ఫోకస్ ను నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే తన కొత్త సినిమా అంటే సుందరానికిి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈసినిమా జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా దీనితో పాటు దసరా సినిమా కూడా చేస్తున్నాడు నాని. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.

'సర్కారు వారి పాట' పెన్నీ సాంగ్ ప్రోమో రిలీజ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ హీరో సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తికరంగా చూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తరువాత ఈయన నుంచి మరో సినిమా రాలేదు. దీంతో వెండి తెరపై మహేష్బాబు కనిపించి రెండేళ్ళు దాటింది. అందుకే అభిమానులు మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.

కృతి శెట్టి హోలీ స్పెషల్ ఫొటో
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ తో కృతిశెట్టి…