‘రాధేశ్యామ్’ డిలీట్ సీన్ల పై ‘రాధాకృష్ణ’ రియాక్షన్..!

Radha Krishna gives clarity about Radhe Shyam deleted scenes,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Radha Krishna,Director Radha Krishna,Radhe shyma Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest super Hit Movie,Radhe Shyam Box Office Collection,s Radha Krishna About Deleted Scenes From Radhe Shyam Movie,Deleted Scence From Radhe Shyam Movie,lead pair Prabhas and Pooja Hegde as a Vikramaditya and Prerana, Many of the Scenes and shots were deleted From Radhe Shyam Movie,Radhe Shyam recently completed 1 week successfully and has crossed the 200 crores mark, Radhe Shyam Best Love Story In Film Industry,Radhe Shyam Collection Updates,Radhe Shyam Mvie Songs,Radhe Shyam Songs,Radhe Shyam super hit Songs,#Radheshyam

రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం​ రాధేశ్యామ్‌. భారీ అంచనాల మధ్య ఈసినిమా మార్చి 11న రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో మంచి ప్రేమకథగా ఈసినిమా తెరకెక్కగా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించింది ఈసినిమా. ఇక చాలా రోజులు తరువాత ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ పాత్రలో కనిపించగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈసినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధాకృష్ణ ఈసినిమాలో డిలీట్ చేసిన సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉండగా కొన్ని సీన్లను కట్ చేయాల్సి వచ్చింది.. ఆ సీన్లు పాత్రల చుట్టూ తిరిగేవి అయినా కూడా డిలీట్ చేయాల్సి ఉంది.. త్వరలోనే ఈసీన్లతో కలిసి రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇంకా ఈసినిమాలో క్లైమాక్స్ చాలా ప్రధానమైనది.. ఈ సీన్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి చిత్ర చిత్రయూనిట్ 24 గంటలు పనిచేసిందని తెలిపారు.

కాగా భాగ్యశ్రీ, కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్ తదితరులు ఈసినిమాలో కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సౌత్ వర్షన్స్ కు పాటలు అందించగా.. హిందీలో మిథున్‌, అమాల్‌ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ అందించగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =