శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ “యశోద’” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీ ఫిమేల్ సెంట్రిక్ సినిమా అయినప్పటికీ ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“యశోద “మూవీ యాక్షన్ సన్నివేశాలకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ ను మేకర్స్ ఎంపిక చేశారు. ఇటీవల హైదరాబాద్ లో యానిక్ బెన్ నేతృత్వంలో “యశోద” కోసం కీలక యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “యశోద “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సమంత కథానాయికగా తెరకెక్కిన “శాకుంతలం”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పలు ప్రాజెక్ట్స్ తో సమంత బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: