సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కళావతి కి ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. తాజాగా సెకండ్ సింగిల్ “పెన్నీ”లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో తొలిసారి మహేష్ బాబు తనయ సితార అదిరిపోయే స్టెప్పులేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇన్ స్టా గ్రామ్ లో మహేష్ పాటలకు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే సితార తొలిసారి ఈ పాటలో మహేష్ తో కలిసి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: