
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 46


వరుణ్ తేజ్ లేటెస్ట్ వర్కౌట్

"అహం బ్రహ్మస్మి "లో అతిథి పాత్రలో కామెడీ హీరో

"AK " రీమేక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్

మరో తెలుగు మూవీలో విజయ్ సేతుపతి

100 కోట్లతో 'రాక్షసుడు 2'

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!

'రామ్ 19' లో కన్నడ బ్యూటీ

సీనియర్ హీరోల రీ ఎంట్రీ

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్
ఎయిర్ హోస్టెస్‌గా అనసూయ

'డెవిల్' కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్స్

"ఆచార్య "మూవీ లో సోనూసూద్ లుక్

"AK " మూవీ సెట్స్ లో నిత్యామీనన్

'మిషన్ ఇంపాజిబుల్' విలక్షణ నటుడు
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాప్సీ ప్రధాన పాత్రలో `మిషన్ ఇంపాజిబుల్` సినిమా తెరకెక్కుతుంది. చాలా గ్యాప్ తరువాత తాప్సీ మళ్లీ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

వరుణ్ తేజ్ లేటెస్ట్ వర్కౌట్
అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"అహం బ్రహ్మస్మి "లో అతిథి పాత్రలో కామెడీ హీరో
హీరో మంచు మనోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్రహ్మస్మి` అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల కొన్ని నెలల పాటు వాయిదా పడినా "అహం బ్రహ్మస్మి " మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో మనోజ్ కి కమ్ బ్యాక్ మూవీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీఅంచనాలు నెలకొన్నాయి.

"సలార్ " మూవీ లో కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“సలార్ “మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

"AK " రీమేక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలోమలయాళ సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

'సర్కారు వారి పాట' కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నఫస్ట్ లుక్
మహేష్ సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తే అది ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిలో భాగంగానే సర్కారు వారి పాట నుండి జులై 31న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. అప్పుడే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఫస్ట్ నోటీస్ అంటూ సూపర్ స్టార్ టీమ్ మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పటికే 24 గంటల్లోనే ట్విట్టర్ లో అత్యధిక లైక్స్ పొందడమే కాకుండా అత్యధికంగా రీ ట్వీట్స్ పొందిన పోస్టర్ గా ఒక రికార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫాస్టెస్ట్ 100k లైక్స్ అందుకున్న పోస్టర్ కూడా ఇదే అవ్వడం విశేషం…

తమిళ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్
బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయిపల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరో తెలుగు మూవీలో విజయ్ సేతుపతి
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ , ప్రేక్షకులను అలరిస్తూ విజయ్ సేతుపతి కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం 13 తమిళ , ఒక మలయాళ , ఒక హిందీ మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్"సైరా నరసింహారెడ్డి "మూవీ లో తమిళ వారియర్ రాజ పాండి గా చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

100 కోట్లతో 'రాక్షసుడు 2'
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాక్షసుడు. తమిళంలో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు ఇది రీమేక్. ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. ఈసినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు సాయి శ్రీనివాస్ కెరీర్ లోనే మొదటి సూపర్ హిట్ ను ఇచ్చింది ఈసినిమా. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.

"హిడింబ"ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ప్రముఖ యాంకర్ , డైరెక్టర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు సూపర్ హిట్ హారర్ కామెడీ "రాజు గారి గది " మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ", "రాజు గారి గది 2", "రాజు గారి గది 3" మూవీస్ తో అశ్విన్ బాబు ప్రేక్షకులను అలరించారు. ఒక హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి అశ్విన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"సర్కారు వారి పాట "ఫస్ట్ నోటీస్ పోస్టర్ రికార్డ్
టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!
మెగాస్టార్ చిరు రీఎంట్రీ తరువాత వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో ముందుగా కొరటాలతో వస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే. అసలు కరోనా లేకపోతే ఈ ఆగష్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమాకోసం భారీ స్థాయిలో సెట్స్ కూడా వేయనున్నట్టు తెలుస్తుంది. ఆ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి కూడా.

'రామ్ 19' లో కన్నడ బ్యూటీ
‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న హీరో రామ్.. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా. టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈసినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈసినిమాలో భాగంకానున్నట్టు తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కన్నడ బ్యూటీ అక్షర గౌడ. ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

సీనియర్ హీరోల రీ ఎంట్రీ
ఒకప్పుడు సక్సెస్ ఫుల్ చిత్ర హీరోస్ గా వెలుగొందిన సీనియర్ హీరోలు ఒక్కొక్కరిగా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్ ఫుల్"స్వయంవరం "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన వేణు "చిరు నవ్వుతో ", హనుమాన్ జంక్షన్ ", కల్యాణ రాముడు ","పెళ్ళాంతో పనేంటి ", "పెళ్ళాం ఊరెళితే ", "యమగోల మళ్ళీ మొదలైంది ", "గోపి గోపిక గోదారి "వంటి మూవీస్ తో వేణు తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. "రామాచారి "(2013 )మూవీ తరువాత వేణు సినిమాలకు దూరమయ్యారు. 8సంవత్సరాల తరువాత వేణు తొట్టెంపూడి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందుతున్న "రామారావు ఆన్ డ్యూటీ" మూవీ లో కీలక పాత్రలో…

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఎయిర్ హోస్టెస్‌గా అనసూయ
అద్భుతమైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది. సర్కారు వారి పాట నుండి మహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా.. తమ హీరో లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఒప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఈసినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఈవిషయంలో కాస్త డిజప్పాయింట్ తో ఉన్న అభిమానులను ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే నేడు మహేష్ సినిమా లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఊహించినట్టే ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అంతేకాదు సంక్రాతికే వస్తున్నట్టు కన్ఫామ్ కూడా చేశారు.

'డెవిల్' కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్స్
సినిమా రిలీజ్ ల సంగతి పెక్కన పెడితే కళ్యాణ్ రామ్ కూడా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు నవీన్ మేడారం దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. డెవిల్ అనే టైటిల్ తో పేట్రియాటిక్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇక సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్‌రామ్ ఇది వరకెప్పుడూ చేయని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.

"ఆచార్య "మూవీ లో సోనూసూద్ లుక్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్…

"AK " మూవీ సెట్స్ లో నిత్యామీనన్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలోమలయాళ సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ఎంపిక అయ్యారు.