సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలోమలయాళ సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లానాయక్ గా నటిస్తున్న ఈ రీమేక్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. “AK ” రీమేక్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుందని ఒక స్పెషల్ వీడియో ద్వారా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. మహేష్ బాబు “సర్కారువారి పాట “, ప్రభాస్ “రాధేశ్యామ్ “, వెంకటేష్ , వరుణ్ తేజ్ “F 3” మూవీస్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “AK ” రీమేక్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: