
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 47


నటుడిగా 'దర్శకేంద్రుడు'

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్

"ప్రాజెక్ట్ K "లో అమితాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్

హారర్ థ్రిల్లర్ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్

క్రెడిట్ అంతా తారక్ అన్నదే - సత్యదేవ్

"గని" సెట్స్ లో సయీ మంజ్రేకర్

"కిరాతక "మూవీ అప్ డేట్

"అఖండ "లో అఘోర గా జగపతి బాబు ?

సోషల్ మీడియా లో నాని హవా

'ప్రాజెక్ట్ కే' కోసం 200 రోజులు

"వన్ బై టు "మూవీ టీజర్ రిలీజ్

'లెఫ్టినెంట్ రామ్' బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?

మరోసారి వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు

'ఆర్ఆర్ఆర్' సీత షూటింగ్ కంప్లీట్

అఫీషియల్..'RC 15' లో కియారా
ఎప్పటినుండో ఉన్న సస్పెన్స్ కు ఇప్పుడు ఫైనల్ గా తెర పడింది. ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటంటే... శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈసినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల నుండి ఈసినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ భామలు అలియా.. మరోవైపు కియారా పేర్లు వినిపించాయి. ఆ తరువాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫామ్ అయింది అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ వార్తలకు బ్రేక్…

నటుడిగా 'దర్శకేంద్రుడు'
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ఈసినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్
రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు శిరీష్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. అంతేకాదు.. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా తెలిపాడు.

"ప్రాజెక్ట్ K "లో అమితాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపికా పడుకొనే జంటగా భారీ బడ్జెట్ తో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా "ప్రాజెక్ట్ K" వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ లో దీపిక పడుకొనే కథానాయిక. బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "మనం ", "సైరా నరసింహా రెడ్డి "మూవీస్ తరువాత అమితాబ్ "ప్రాజెక్ట్ K "లో నటిస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

హారర్ థ్రిల్లర్ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

క్రెడిట్ అంతా తారక్ అన్నదే - సత్యదేవ్
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సత్యదేవ్ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “ , "గాడ్సే " , "స్కైలాబ్ "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు”హిందీ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.. "లూసిఫర్ "తెలుగు రీమేక్ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.

శ్రీదేవి సోడా సెంటర్.. శ్రీదేవి ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలాగే సుధీర్ బాబు ఇంట్రడక్షన్ వీడియో ను కూడా రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ లో ఉన్న సోడా సెంటర్ శ్రీదేవి ఎవరు అన్నది ఇప్పుడు మేకర్స్ రివీల్ చేశారు.

"గని" సెట్స్ లో సయీ మంజ్రేకర్
సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ " దబాంగ్ 3" మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"కిరాతక "మూవీ అప్ డేట్
విజన్ సినిమాస్ బ్యానర్ పై ఎమ్ వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయికుమార్ , పాయల్ రాజ్ పుత్ జంటగా క్రైమ్ థ్రిల్లర్ “కిరాతక” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13 వ తేదీ ప్రారంభం కానుంది. పూర్ణ, దాసరి అరుణ్‌కుమార్, దేవ్‌గిల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. “కిరాతక “ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్
గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తర్వాత మహేష్..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దుబాయ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసారు. ఆ తర్వాత రెండో షెడ్యూల్‌ను దుబాయ్‌తో పాటు గోవాలో చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

'కె.జి.యఫ్ 2' అధీరా న్యూ పోస్టర్ రిలీజ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజై... వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు దీనికి పార్ట్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి వచ్చిన…

"అఖండ "లో అఘోర గా జగపతి బాబు ?
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సోషల్ మీడియా లో నాని హవా
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ షూటింగ్ ను హీరో నాని కంప్లీట్ చేశారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'ప్రాజెక్ట్ కే' కోసం 200 రోజులు
ప్రభాస్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు సలార్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ మధ్యే ప్రభాస్ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం అమితాబ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక తన షూటింగ్ పూర్తయ్యేవరకు అమితాబ్ హైద్రాబాద్ లోనే ఉండనున్నారు.

"వన్ బై టు "మూవీ టీజర్ రిలీజ్
చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శివ ఏటూరి దర్శకత్వంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా తెరకెక్కిన "వన్ బై టు" మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. లియాండర్ లీ మార్టీ , ఆదేశ్ రవి సంగీతం అందించారు. కరణం శ్రీనివాసరావు నిర్మాత. సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ‘వన్ బై టు’ చిత్ర టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సాయి కుమార్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'లెఫ్టినెంట్ రామ్' బర్త్ డే గ్లింప్స్ రిలీజ్
మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు 'మహానటి' నిర్మాతలతో కలసి హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హనురాఘవపూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథను సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ వార్ నేపథ్యంలో హను రాఘవపూడి శైలిలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 1960స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు అర్థం అవుతోంది. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్…

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?
సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "మహాసముద్రం "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాషలలో "ఒకే ఒక జీవితం ", శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీస్ తెరకెక్కుతున్నాయి. హీరో శర్వానంద్ ప్రస్తుతం "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు ఒక టైమ్ ట్రావెల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మరోసారి వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు
సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇక ఈసినిమా తరువాత ఈసినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసిన కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకూ మరో సినిమాను లైన్ లో పెట్టలేదు. ఉప్పెన తర్వాత బుచ్చి బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తర్వాత సినిమా ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని కూడా అన్నారు. కానీ అది కూడా కుదరలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజిగా ఉన్నాడు. దీని తర్వాత కొరటాల శివతో, ప్రశాంత్ నీల్ తో కమిట్ అయిన చిత్రాలను పూర్తి…

భారీ సాంగ్ తో "#RC15" షూటింగ్ ప్రారంభం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీబడ్జెట్ తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “,కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి. బ్లాక్ బస్టర్స్ "భారతీయుడు ", "జీన్స్ ", "ఒకే ఒక్కడు ", అపరిచితుడు ", "శివాజి ", "రోబో ", "2. 0" వంటి డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన శంకర్ ఎస్ దర్శకత్వంలో "#RC15" మూవీ కి హీరో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'ఆర్ఆర్ఆర్' సీత షూటింగ్ కంప్లీట్
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "ఆర్ఆర్ఆర్". స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ లో పాల్గొనలేకపోయిన అలియా ఇటీవలే ఆర్ఆర్ఆర్ సెట్ లో అడుగుపెట్టింది. అయితే తాజాగా సినిమాలోని తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని అలియా భట్ పూర్తి చేసుకుంది. సినిమాలో రెండు పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ మిగిలి ఉండటంతో అలియా భట్ వారం రోజుల క్రితం ఆ షూటింగ్ లో పాల్గొంది.షూటింగ్…