ఒకప్పుడు సక్సెస్ ఫుల్ చిత్ర హీరోస్ గా వెలుగొందిన సీనియర్ హీరోలు ఒక్కొక్కరిగా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్ ఫుల్”స్వయంవరం “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన వేణు “చిరు నవ్వుతో “, హనుమాన్ జంక్షన్ “, కల్యాణ రాముడు “,”పెళ్ళాంతో పనేంటి “, “పెళ్ళాం ఊరెళితే “, “యమగోల మళ్ళీ మొదలైంది “, “గోపి గోపిక గోదారి “వంటి మూవీస్ తో వేణు తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “రామాచారి “(2013 )మూవీ తరువాత వేణు సినిమాలకు దూరమయ్యారు. 8సంవత్సరాల తరువాత వేణు తొట్టెంపూడి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కోరుకున్న ప్రియుడు” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన వద్దే నవీన్ “పెళ్ళి “, “మనసిచ్చి చూడు”, “మా బాలాజీ”, “చాలా బాగుంది” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. వద్దే నవీన్ నటించిన పలు మూవీస్ పరాజయం పాలయ్యాయి.”ఎటాక్ “(2016 )మూవీ తరువాత నవీన్ టాలీవుడ్ కు దూరం అయ్యారు. 3 సంవత్సరాల తరువాత నవీన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయ్యారు. ఒక టాప్ హీరో మూవీ లో వడ్డే నవీన్ కీలకపాత్రలో నటించ నున్నారని, ఆ పాత్రకై ప్రత్యేకమైన లుక్ కూడా మెయింటెన్ చేస్తున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: