సినిమా రిలీజ్ ల సంగతి పెక్కన పెడితే కళ్యాణ్ రామ్ కూడా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు నవీన్ మేడారం దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. డెవిల్ అనే టైటిల్ తో పేట్రియాటిక్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇక సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్‌రామ్ ఇది వరకెప్పుడూ చేయని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా బ్రిటీష్ కాలానికి చెందిన కథాంశంతో రూపొందనున్న సినిమా కాబట్టి ఈసినిమాకు అప్పటి సెట్టింగ్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమాకోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్స్ ను తీసుకున్నారు చిత్రయూనిట్. టాలీవుడ్‌లో ‘పుష్ప, రంగస్థలం, ఉప్పెన, తలైవి, అంతరిక్షం 9000 kmph’.. సహా పలు చిత్రాలకు తమ ఆర్ట్ వర్క్‌తో ఓ డిఫరెంట్ లుక్ తీసుకొచ్చిన ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనిక ఇప్పుడు ఈ చిత్రంలో భాగమైనట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
To Take you all to the Era that no one witnessed🙌
Production Designer “RAMAKRISHNA” & Art Director “MONICA” On Board For@NANDAMURIKALYAN ‘s #DEVIL– THE BRITISH SECRET AGENT🕵️♂️
▶️ https://t.co/jhh8Z8suiv pic.twitter.com/uL2SNwhZdZ
— ABHISHEK PICTURES (@AbhishekPicture) July 31, 2021
కాగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: