సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న (జులై 30) సోనూసూద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. “ఆచార్య” చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో నుదుట బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్ష మాల ధరించిన సోనూసూద్ పిలకతో డిఫరెంట్ లుక్ లో కనిపించారు. తాజాగా విడుదలైన సోనూసూద్ “ఆచార్య” లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిమానులు , సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్ ను సోనూసూద్ అందుకున్నారు. హ్యాపీ బర్త్ డే సోనూసూద్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: