
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 4


ఇకపై లవ్ స్టోరీస్ చేయను..!

టాలీవుడ్ పై తమిళ హీరోల ఫోకస్

మరో వెబ్ సిరీస్ కు రెడీ.. స్టైలిష్ స్పై గా సామ్

లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్

'గోపీచంద్' 30వ సినిమా ప్రారంభం

హోలీ రోజున "గని" మూవీ రిలీజ్?

'తీస్ మార్ ఖాన్'.. ఆది ఫస్ట్ గ్లాన్స్

'అర్జున ఫల్గుణ' ట్రైలర్ రిలీజ్

"శ్యామ్ సింగ రాయ్" మేకింగ్ వీడియో రిలీజ్

'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్

'ధనుష్' తెలుగు సినిమా టైటిల్ రిలీజ్

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్

'డిటెక్టివ్ సత్యభామ' రిలీజ్ డేట్ ఫిక్స్

రీమేక్ మూవీస్ లో నటించను -నాని

"అఖండ" మూవీ 25 డేస్ సెలబ్రేషన్స్
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ” చేరింది.

ఇకపై లవ్ స్టోరీస్ చేయను..!
ఇకపై రీమేక్ లు చేయను.. ఇకపై లవ్ స్టోరీస్ చేయను ఇలా పలు హీరోస్ అనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా మరో హీరో కూడాలవ్ స్టోరీస్ చేయను అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని అఖిల్. అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడో తరం నటుడు అఖిల్. మంచి బ్యాక్ డ్రాప్ తో ఎంట్రీ ఇచ్చినా కూడా ఫస్ట్ హిట్ కొట్టాడని చాలా టైమే పట్టింది అఖిల్ కు. వరుసగా మూడు ఫ్లాప్స్ అందుకున్న అఖిల్.. ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో మంచి హిట్‌ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

టాలీవుడ్ పై తమిళ హీరోల ఫోకస్
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోలకు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. తెలుగు మూవీస్ సక్సెస్ రేటు , భారీబడ్జెట్ లు , భారీ పారితోషికాలు ఉండడంతో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ మూవీస్ పై అధిక ఆసక్తి కనపరుస్తున్నారని సమాచారం.

మరో వెబ్ సిరీస్ కు రెడీ.. స్టైలిష్ స్పై గా సామ్
ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ రంగంలోనూ.. హోస్ట్ గాను.. సేవా కార్యక్రమాలు ఇలా పలు విషయాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇక దర్శక ద్వయం రాజ్, డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీమెన్ 2’తో ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది సమంత. ఇక ఈ సిరీస్ లో నటించిన సమంతకు ఏ రేంజ్ లో ప్రశంసలు దక్కాయో చూాశాం. అంతేకాదు మొదటి వెబ్ సిరీస్ కే అవార్డ్ ను సైతం గెలుచుకుంది.

లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్
"పాప్‌కార్న్" మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన సంయుక్త మీనన్ "కలరి" మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. "గాలిపట" మూవీ తో శాండల్ వుడ్ , "భీమ్లా నాయక్" మూవీ తో టాలీవుడ్ కు సంయుక్త పరిచయం అవుతున్నారు. ఒక్క తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే కళ్యాణ్ రామ్ "బింబిసార" మూవీ లో నటించారు.

"రాధేశ్యామ్" ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ- పూజాహెగ్డే
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం…

'గోపీచంద్' 30వ సినిమా ప్రారంభం
ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు చాాలా ఏళ్లు సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. రీసెంట్ గానే సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు.

"పుష్ప :ది రైజ్"100 మిలియన్ వ్యూస్ తో "శ్రీవల్లి "సాంగ్ రికార్డ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ…

హోలీ రోజున "గని" మూవీ రిలీజ్?
అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు . థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేశారు.

'తీస్ మార్ ఖాన్'.. ఆది ఫస్ట్ గ్లాన్స్
సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది చేతిలో నాలుగైదు సినిమాల వరకూ ఉన్నాయి. వాటిలో కొన్నిసినిమాలు రిలీజ్ కు సిద్దమవుతుండగా. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వాటిలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా తీస్ మార్ ఖాన్.

'అర్జున ఫల్గుణ' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో శ్రీవిష్ణు మాత్రం మొదటి నుండి డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా విభిన్నమైన కథలకే తను ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాడు. అందుకే శ్రీవిష్ణు సినిమాలు అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అన్న పేరును అయితే సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు. అందులో అర్జున ఫల్గుణ సినిమా కూడా ఒకటి. శ్రీవిష్ణుహీరోగా తేజ మార్ని దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈసినిమాను ఈనెల 31న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలు…

"శ్యామ్ సింగ రాయ్" మేకింగ్ వీడియో రిలీజ్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగరాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్
బాహుబలి, సాహో లాంటి సినిమాల తరువాత ప్రభాస్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈసినిమాతో మరోసారి లవర్ బాయ్ లా మారిపోయాడు ప్రభాస్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్ లో బిజీగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్
"జానకి రాముడు "(1988) మూవీ తో టాలీవుడ్ కు రైటర్ గా పరిచయం అయిన కె వి విజయేంద్ర ప్రసాద్ "మగధీర ", విక్రమార్కుడు ", "బాహుబలి", బాహుబలి 2","బజరంగీ భాయిజాన్ ", "మణికర్ణిక :ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ "(హిందీ ), "తలైవి "(తమిళ ) వంటి భారీ మూవీస్ కు రైటర్ గా వర్క్ చేశారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన "రాజన్న "మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకుంది. బెస్ట్ స్టోరీ రైటర్ గా "బజరంగీ భాయిజాన్ " హిందీ మూవీ కి విజయేంద్ర ప్రసాద్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

ఛాలెంజింగ్ పాత్రలకై ఎదురు చూస్తున్నా - అమృతా అయ్యర్
"RED" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అమృతా అయ్యర్ "30 రోజుల్లో ప్రేమించడం ఎలా "మూవీ తో ప్రేక్షకులను తన అందం , అభినయం తో అలరించారు. అమృత ప్రస్తుతం "అర్జున ఫల్గుణ", "హనుమాన్ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత జంటగా తెరకెక్కిన "అర్జున ఫల్గుణ" మూవీ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అమృతా అయ్యర్ పాత్రికేయులతో ముచ్చటించారు.

'ధనుష్' తెలుగు సినిమా టైటిల్ రిలీజ్
తమిళ స్టార్ ధనుష్ కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, హిందీ, ఇంకా ఇంగ్లీష్ లో కూడా సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తమిళ్ లో తను తీసిన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు ధనుష్. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగులోనే స్ట్రెయిట్ సినిమాను తీయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల తో సినిమాను ప్రకటించాడు ధనుష్. తాజాగా మరొక స్ట్రెయిట్ తెలుగు సినిమాను అనౌన్స్ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

"విక్రమ్" మూవీ సెట్స్ లో కమల్ హాసన్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "ఖైదీ "మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "విక్రమ్ "తమిళ మూవీ 2022 మార్చి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. "విక్రమ్" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

'డిటెక్టివ్ సత్యభామ' రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. ఈసినిమాకు కూడా రిలీజ్ కు సిద్దమైంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది అందరినీ ఆకట్టుకొని మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల డిసెంబర్ 31 న థియేటర్లలో విడుదలవుతుందని ప్రెస్ మీట్ ద్వారా తెలియచేశారు.

కన్ఫామ్.. వెంకీ అట్లూరీ తో ధనుష్ సినిమా.. టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
తమిళ్ హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందులో స్టార్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శేఖర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ధనుష్ తో శేఖర్ కమ్ముల ఒక థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

రీమేక్ మూవీస్ లో నటించను -నాని
సక్సెస్ ఫుల్ "అష్టా చమ్మా "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాని పలు సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాని రెండు విభిన్న పాత్రలలో నటించిన "శ్యామ్ సింగరాయ్ "మూవీ 24 వ తేదీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం "అంటే . సుందరానికీ !" మూవీ లో నటిస్తున్నారు. "దసరా" మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది.