‘తీస్ మార్ ఖాన్’.. ఆది ఫస్ట్ గ్లాన్స్

Aadis Tees Maar Khan First Glimpse Out Now, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tees Maar Khan First Glimpse, Tees Maar Khan Movie First Glimpse, Aadis Tees Maar Khan, Aadis Tees Maar Khan First Glance, Tees Maar Khan Glance poster, Tees Maar Khan, Tees Maar Khan Movie, Tees Maar Khan Telugu Movie, Tees Maar Khan Movie Updates, Tees Maar Khan Movie Latest News, Aadi Sai Kumar, Aadi New Movie Tees Maar Khan, #TeesMaarKhan, Tees Maar Khan Glance

సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది చేతిలో నాలుగైదు సినిమాల వరకూ ఉన్నాయి. వాటిలో కొన్నిసినిమాలు రిలీజ్ కు సిద్దమవుతుండగా. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వాటిలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా తీస్ మార్ ఖాన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో తెరెకక్కుతున్న ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. ఇక ఇదిలా ఉండగా ఆది సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా ”తీస్ మార్ ఖాన్” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లాన్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో స్టూడెంట్ గా, రౌడీ గా, పోలీస్ అంటూ ఆది లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. దీనిని బట్టి ఈ సినిమాలో ఆది త్రీ షేడ్స్ లో కనిపించబోతున్నాడన్న విషయం అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =