గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. “రాధేశ్యామ్ “మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రాధేశ్యామ్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూజాహెగ్డే మాట్లాడుతూ .. అందరూ బాగున్నారా .. నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాననీ , నిర్మాతలు ఈ సినిమాను ఎంతో ప్యాషన్ తో నిర్మించారనీ , ఇక మా దర్శకుడు రాధాకృష్ణకుమార్ గారు అదే పనిగా సినిమాపై కూర్చున్నారనీ , తాను అనుకున్నట్టుగా అవుట్ పుట్ వచ్చేంతవరకూ ఆయన మమ్మల్ని వదిలిపెట్టలేదనీ , వేరే సినిమాల షూటింగ్స్ లో ఉన్నప్పటికీ పిలిచి మరీ చేయించారనీ , “రాధేశ్యామ్” ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనీ , ఇందులో ఏదో మ్యాజిక్ ఉందనీ , మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనీ , పూర్తి డిఫరెంట్ గా ఉండే కథ ఇదనీ , డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలో ప్రభాస్ , తాను ఇద్దరం కూడా కొత్తగా కనిపిస్తామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: