ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై.. ఆతరువాత విలన్ గా కూడా చేసి తన టాలెంట్ చూపించి అందర్నీ మెప్పించి.. ఆ తరువాత యాక్షన్ హీరోగా మారిన నటుడు గోపీచంద్. తన కెరీర్ లో పలు డిఫరెంట్ కథలతో అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. అయితే ప్రస్తుతం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు చాాలా ఏళ్లు సరైన హిట్ లేక వెనకపడిపోయాడు. అయినా కూడా నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. రీసెంట్ గానే సీటీమార్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే జోష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘లక్ష్యం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో మరో చిత్రం ‘లౌక్యం’ రాగా అది కూడా హిట్ గానే నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో ఇచ్చారు. ఇక నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కాగా పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
#Gopichand30 is here🕺
Pics from the Pooja Ceremony🪔 of @YoursGopichand & @DirectorSriwass ‘s Hattrick film,
bankrolled by @peoplemediafcy
Shoot Starts Next Month 💥
🎬VV Vinayak
🎥 @TGVenkateshMP
First shot direction @Ragavendraraoba@vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/gcZMaytQln— People Media Factory (@peoplemediafcy) December 24, 2021
ఇంకా దీనితో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: