తమిళ్ హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందులో స్టార్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శేఖర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ధనుష్ తో శేఖర్ కమ్ముల ఒక థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాతో మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ చెప్పాడు. తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ధనుష్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడది కన్ఫామ్ చేసేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా మేకర్స్ ఈవిషయాన్ని తెలియచేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ లాంటి హీరోతో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తెలుగు, తమిళ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాదు ఈసినిమా నుండి టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు అప్ డేట్ ఇచ్చారు. రేపు (డిసెంబర్ 23)న ఉదయం 9.36 నిమిషాలకు ఈసినిమా నుండి టైటిల్ ను రిలీజ్ చేయనున్నారు.
We feel elated to team up with the National Award Winning Actor @dhanushkraja garu for a prestigious film in Telugu & Tamil🔥
Written & Directed by #VenkyAtluri, Produced by @vamsi84 & #SaiSoujanya
Title reveal at 09:36AM, Tomorrow💥@sitharaents @fortune4cinemas pic.twitter.com/JKnLyCHx2A
— Sithara Entertainments (@SitharaEnts) December 22, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: