హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. “చిరంజీవి “భోళా శంకర్ “, నాని “దసరా ” మూవీస్ కు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి ” మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ లో జగపతిబాబు, ఆదిపినిశెట్టి, రమాప్రభ, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని నవంబర్ నెలలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. బర్త్ డే విషెస్ తెలుపుతూ కీర్తి కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: