ఈ ఏడాది పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఎక్కడా తగ్గట్లేదు. అంతేకాదు డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ సినిమాకు గామి అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది. నీకున్న సమస్య నిన్నే కాదు పరోక్షంగా మాఅందరినీ బాధిస్తోంది. శంకర్ ఇక మా మేలు కొరకు నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టి పోవాలి.. తన సమస్య ఏంటి ? తనకున్న సమస్యతో ఎక్కడ బ్రతుకుతాడు? ఎలా బ్రతుకుతాడు? అంటూ చెప్పటం గ్లింప్స్ లో కనిపిస్తున్నాయి. మొత్తానికి టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.
Unfolding the Journey of the Quest 🔥
Here’s the Title Announcement Video of @vcelluloidsoffl & @KarthikKultkreations #GAAMI 💥
▶️ https://t.co/RbmvDGE2ik⭐ing @VishwakSenActor @iChandiniC @Abhinaya4u
A #Vidyadhar Film 📽️@KarthikSabaresh @adithyaVmovies pic.twitter.com/AzgkywU3Ae
— VcelluloidOfficial (@vcelluloidsoffl) October 18, 2021
కాగా విద్యాధర్ కాగిట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























