
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 20


'ASK 20'.. ఆది హీరోయిన్ ఖరారు

"అర్జున ఫల్గుణ "మూవీ టీజర్ రిలీజ్ డేట్

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!

మారేడుమిల్లి లో "రామారావు ఆన్ డ్యూటీ"

'ఎఫ్ 3' టీమ్ కు వెంకీ టీ పార్టీ

'డేగల బాబ్జీ' ట్రైలర్ రిలీజ్

కమల్ 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

"105 మినిట్స్"మూవీ గ్లింప్స్ రిలీజ్

మరో అరుదైన గౌరవం దక్కించుకున్న 'నాట్యం'

"ఏజెంట్ " మూవీ అప్ డేట్

'చిరు 154' గ్రాండ్ లాంచ్.. మెగా లుక్ రిలీజ్

"పుష్పక విమానం " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

చిరంజీవి పై డైరెక్టర్ బాబీ ట్వీట్

'స్కైలాబ్' ట్రైలర్ రిలీజ్

మెగా హీరోలతో 'సాయి తేజ్'.. ఎమోషనల్ పోస్ట్..!

కమల్ బర్త్ డే కు రెడీ అవుతున్న 'విక్రమ్' టీజర్

'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల రాజ రాజ చోర సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

'ASK 20'.. ఆది హీరోయిన్ ఖరారు
యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజన్ సినిమాస్, బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు…

"అర్జున ఫల్గుణ "మూవీ టీజర్ రిలీజ్ డేట్
యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సూపర్ హిట్ "రాజ రాజ చోర" మూవీ తో ప్రేక్షకులను అలరించిన శ్రీవిష్ణు తాజాగా మరో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

హీరో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వ శాఖ లో పనిచేసిన కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా సాయి తేజ్ ప్రమాదానికి గురికావడం తో పోస్ట్ పోన్ అయ్యింది. సాయితేజ్ కోలుకోవడం తో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .

'పక్కా కమర్షియల్' టీజర్ రిలీజ్
మొత్తానికి మారుతి చాలా తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో సినిమాలు తీసి హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన ఈసినిమాలో దీపావళి రోజున విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా ను మారుతి కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

డిసెంబర్ లో 'ఇండియన్ 2' రీ స్టార్ట్..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఎప్పుడో సెట్స్ పైకి వచ్చిన ఈసినిమా మధ్యలోనే అర్థాంతరంగా ఆగిపోయింది. దానికి తోడు ఈమధ్య ఈసినిమా గురించి శంకర్ కు లైకా కు మధ్య వివాదాలు కూడా వచ్చాయి.

మారేడుమిల్లి లో "రామారావు ఆన్ డ్యూటీ"
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన "ఖిలాడి" మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. రవితేజ హీరోగా “రామారావు ఆన్ డ్యూటీ ”, "ధమాకా " మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. రవితేజ హీరోగా "రావణాసుర ", టైగర్ నాగేశ్వర రావు "మూవీస్ అనౌన్స్ అయ్యాయి.బ్లాక్ బస్టర్"క్రాక్ " మూవీ తరువాత హీరో రవితేజ వరుస యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

'ఎఫ్ 3' టీమ్ కు వెంకీ టీ పార్టీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఆతరువాత వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయాలని ముందు ఫిక్స్ అయ్యారు.. కానీ మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

'డేగల బాబ్జీ' ట్రైలర్ రిలీజ్
గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమాతో వస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

కమల్ 'విక్రమ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందని ఇప్పటికే అర్థమైంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

"105 మినిట్స్"మూవీ గ్లింప్స్ రిలీజ్
రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ప్రయోగాత్మక మూవీ “105 మినిట్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఒకే ఒక్క పాత్రతో ఇండియన్ స్క్రీన్ పై తొలిసారిగా రూపుదిద్దుకుంది. “105 మినిట్స్ “మూవీ ప్రెస్ మీట్ లో హన్సిక మాట్లాడుతూ మంచి కథను ఎన్నుకొని ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తీసిన దర్శక , నిర్మాతలు అభినందనీయులనీ , సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ సింగిల్ షాట్‌లో తీశామనీ , హన్సిక సహకారంతోనే చిత్రం త్వరగా పూర్తయిందనీ చెప్పారు. ఆరు రోజుల్లోనే “105 మినిట్స్ ” చిత్రం…

మరో అరుదైన గౌరవం దక్కించుకున్న 'నాట్యం'
కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోవచ్చు కానీ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అలాంటి సినిమానే రీసెంట్ గా వచ్చిన నాట్యం సినిమా. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. అలాంటిది ఇప్పుడు నృత్యం నేపథ్యంలో సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు నాట్యం టీమ్. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది ఈసినిమా.

"ఏజెంట్ " మూవీ అప్ డేట్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

'రాధేశ్యామ్' క్లైమాక్స్ కోసం సంవత్సరం నుండి పని చేస్తున్నా..!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల చాలా లేట్ అయింది. ఇక భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం ఈ సినిమా క్లైమాక్స్ కోసమే దాదాపు ఏడాది నుండి వర్క్ చేస్తున్నారట. ఈవిషయాన్ని స్వయంగా ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మనోజ్ పరమహంస తెలిపారు.

'చిరు 154' గ్రాండ్ లాంచ్.. మెగా లుక్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తీయాలని ఏ డైరెక్టర్ కు మాత్రం ఉండదు. తమ కెరీర్ లో కనీసం ఒక్క సినిమా అయినా చిరుతో తీయాలన్న డ్రీమ్ ఉంటుంది ప్రతి డైరెక్టర్ కు. ఇక ఇప్పుడు తన డ్రీమ్ కూడా నేరవేరుతుంది అంటున్నాడు బాబి. చిరు హీరోగా బాబి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా గ్రాండ్ గా నేడు లాంచ్ అయింది. ఇక ఈ సందర్భంగా సినిమాలోని చిరంజీవి లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. మాస్ లుక్ లో చిరంజీవి ఆకట్టుకునే విధంగా ఉన్నారు. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో…

"పుష్పక విమానం " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పుష్పక విమానం” మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చిరంజీవి పై డైరెక్టర్ బాబీ ట్వీట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న మాస్ ఎంటర్ టైనర్ చిరంజీవి 154 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో జాలరి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించనున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ లో చిరంజీవి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'స్కైలాబ్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అందులో స్కైలాబ్ సినిమా కూడా ఉంది. విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా స్కైలాబ్.

మెగా హీరోలతో 'సాయి తేజ్'.. ఎమోషనల్ పోస్ట్..!
మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత రెండు నెలలకు పైగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు సాయి తేజ్. దసరా రోజున సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజున డిశ్చార్జ్ అయ్యారు. ఇక అప్పుడప్పుడు సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా తాను బాగానే ఉన్నానని చెబుతూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా తన ఫొటోను కూడా షేర్ చేశాడు సాయి తేజ్. దీపావళి సందర్భంగా మెగా హీరోలందరితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసందర్భంగా చిరు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి…

కమల్ బర్త్ డే కు రెడీ అవుతున్న 'విక్రమ్' టీజర్
లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విక్రమ్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ కు కూడా చాలా బ్రేక్ లు పడ్డాయి. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు. గత ఏడాది కమల్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఏడాది బర్త్ డేకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. రేపు నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ టీజర్ విడుదల చేయనున్నారు.