రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ప్రయోగాత్మక మూవీ “105 మినిట్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఒకే ఒక్క పాత్రతో ఇండియన్ స్క్రీన్ పై తొలిసారిగా రూపుదిద్దుకుంది. “105 మినిట్స్ “మూవీ ప్రెస్ మీట్ లో హన్సిక మాట్లాడుతూ మంచి కథను ఎన్నుకొని ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తీసిన దర్శక , నిర్మాతలు అభినందనీయులనీ , సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ చెప్పారు. దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ సింగిల్ షాట్‌లో తీశామనీ , హన్సిక సహకారంతోనే చిత్రం త్వరగా పూర్తయిందనీ చెప్పారు. ఆరు రోజుల్లోనే “105 మినిట్స్ ” చిత్రం పూర్తయినట్లు నిర్మాత బొమ్మక్ శివ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “105 మినిట్స్”మూవీ గ్లింప్స్ ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్ రిలీజ్ చేశారు. సెంథిల్ కుమార్ మాట్లాడుతూ .. హాలీవుడ్ లో మాత్రమే ప్రయత్నించిన సింగల్ షాట్ చిత్రీకరణ కు తాను పెద్ద అభిమాని ననీ, కథ , స్క్రీన్ ప్లే థ్రిల్లింగ్ గా ఉన్నాయనీ , మన తెలుగు చిత్ర పరిశ్రమ లో దర్శకులు కొత్త దనం తో కథలు తెరకెక్కిస్తున్నందుకు గర్వంగా ఉందనీ , ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























