మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన “ఖిలాడి” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. రవితేజ హీరోగా “రామారావు ఆన్ డ్యూటీ ”, “ధమాకా ” మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. రవితేజ హీరోగా “రావణాసుర “, టైగర్ నాగేశ్వర రావు “మూవీస్ అనౌన్స్ అయ్యాయి.బ్లాక్ బస్టర్”క్రాక్ ” మూవీ తరువాత హీరో రవితేజ వరుస యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రవితేజ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.హై వోల్టేజ్ సోషల్ డ్రామా గా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ముగింపు దశ లో ఉంది. థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇండియా లో , కొన్ని సాంగ్స్ యూరోప్ లో చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ మారేడుమల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభం అయ్యింది. యాక్షన్ సన్నివేశాల్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యదార్థ సంఘటనల నేపథ్యంలో సాగే కథ ఇదనీ , రవితేజ పాత్ర అటు మాస్‌నీ, ఇటు క్లాస్‌నీ ఆకట్టుకునేలా ఉంటుందనీ , షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చిందనీ , త్వరలో విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: