మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తీయాలని ఏ డైరెక్టర్ కు మాత్రం ఉండదు. తమ కెరీర్ లో కనీసం ఒక్క సినిమా అయినా చిరుతో తీయాలన్న డ్రీమ్ ఉంటుంది ప్రతి డైరెక్టర్ కు. ఇక ఇప్పుడు తన డ్రీమ్ కూడా నేరవేరుతుంది అంటున్నాడు బాబి. చిరు హీరోగా బాబి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా గ్రాండ్ గా నేడు లాంచ్ అయింది. ఇక ఈ సందర్భంగా సినిమాలోని చిరంజీవి లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. మాస్ లుక్ లో చిరంజీవి ఆకట్టుకునే విధంగా ఉన్నారు. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Our favourite matinee idol, in an avatar we love to see him the most 🔥🔥
Presenting the ‘Mass Moolavirat’ from #Mega154 😎😎
Inka Mana Annayya Araachakam Aarambham 💥💥
Megastar @KChiruTweets @dirbobby @ThisIsDSP ❤️❤️ pic.twitter.com/qaZaWn49ae
— Mythri Movie Makers (@MythriOfficial) November 6, 2021
కాగా రీఎంట్రీ తరువాత చిరు జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఖైదీ.నెం 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత సైరాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దపడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చేస్తున్నారు. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం సినిమా రీమేక్ భోళాశంకర్ అనే సినిమా చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: