
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 12


భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ

స్కైలాబ్ మూవీ పబ్లిక్ టాక్

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే

"శ్యామ్ సింగ రాయ్" మూవీ హిందీ రీమేక్ ?

ఆనందంలో ప్రగ్య జైస్వాల్

"మెగా 154 " మూవీ షూటింగ్ ప్రారంభం

మైక్ టైసన్ నుండి 'లైగర్' టీమ్ కు స్పెషల్ గిఫ్ట్

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్

స్విట్జర్లాండ్‌లో రామ్ చరణ్ ఎంజాయ్

"స్కైలాబ్"మూవీ టీజర్ రిలీజ్

"మడ్డీ " మూవీ ట్రైలర్ రిలీజ్

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్

ఛాలెంజింగ్ పాత్రలకై ఎదురుచూస్తున్నా - సత్యదేవ్

2021 లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇండియా నెం 1 మూవీ "వకీల్ సాబ్ "
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

సత్యదేవ్-నిత్యా మీనన్ 'స్కైలాబ్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే పీరియాడిక్ సినిమాలు, కాస్త ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే వారికి ఈసినిమా బాగా నచ్చుతుంది.

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ
"రొమాంటిక్ "మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

స్కైలాబ్ మూవీ పబ్లిక్ టాక్
స్కైలాబ్ మూవీ పబ్లిక్ టాక్ Thank you for our first review ! 🙏🏼😊 https://t.co/4asXQZUqpZ What a wonderful actor #Satyadev TFI is blessed to have a such an…

"రాధేశ్యామ్" డబ్బింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , కృష్ణం రాజు , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం…

"హైవే " మూవీ కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ విభిన్న కథాంశాల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మాతగా సూపర్ హిట్ "118 "మూవీ ఫేమ్ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ జంటగా "హైవే మూవీ తెరకెక్కింది. సరి కొత్త లుక్ లో ఆనంద్ కనిపించనున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటించారు.

"శ్యామ్ సింగ రాయ్" మూవీ హిందీ రీమేక్ ?
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆనందంలో ప్రగ్య జైస్వాల్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “అఖండ”మూవీకి అనూహ్య స్పందన లభించింది.

"మెగా 154 " మూవీ షూటింగ్ ప్రారంభం
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ , మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ సెట్స్ పైన ఉన్నాయి.

బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో మీకు నచ్చిన మూవీ..?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు ఉంటాయి.. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాంటి ఒక సాలిడ్ కాంబినేషనే బోయపాటి శ్రీను-బాలకృష్ణ ది. వీరిద్దరి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. తన మొదటి సినిమా భద్ర లోనే తన మార్క్ ను చూపించాడు. ఆతరువాత వచ్చిన తులసి సినిమా కూడా అలాంటి జోనరే. మరి అలాంటి యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుంది. అలా వచ్చిన సినిమానే సింహా. ఈసినిమా రికార్డులు సృష్టించింది. దాంతో ఈకాంబినేషన్ అందరికీ నోటెడ్ అయిపోయింది. ఈ కాంబినేషన్‌లో…

బాలయ్య 'అఖండ' విజయం.. ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్
కరోనా వల్ల గత రెండేళ్లు గా సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంటుంది. పెండింగ్ లో ఉన్న సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ రెండు మూడు నెలల్లో పలు సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో రెండు మూడు సినిమాలు మినహాయించి పెద్దగా ఆడిన సినిమాలు మాత్రం ఏం లేవు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన అఖండ సినిమా మాత్రం ఇండస్ట్రీకి కొత్త ఊపునిచ్చింది అని చెప్పొచ్చు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. మరోవైపు బాలయ్య అభిమానుల గురించి…

మైక్ టైసన్ నుండి 'లైగర్' టీమ్ కు స్పెషల్ గిఫ్ట్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న చిత్రం లైగర్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి.. పూరీ లాంటి డైరెక్టర్ ఒక హీరోను ఎలా చూపిస్తాడో తెలుసు కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి పూరీ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందుకు తగ్గట్టే తెరకెక్కిస్తున్నాడు.

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్
రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంగా చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైనర్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

స్విట్జర్లాండ్‌లో రామ్ చరణ్ ఎంజాయ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “ మూవీ 2022 జనవరి 7 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానున్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి…

"స్కైలాబ్"మూవీ టీజర్ రిలీజ్
డాక్టర్ కె రవికిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “ డిసెంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు రావడంతో ప్రజలంతా ఏం జరుగుతుందోనని ఆసక్తి గా ఎదురుచూసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని…

"మడ్డీ " మూవీ ట్రైలర్ రిలీజ్
ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ గా పాన్ ఇండియా మూవీ గా “మడ్డీ “మూవీ తెరకెక్కింది. పి కె 7 క్రియేషన్స్ బ్యానర్ పై రోడ్ రేసింగ్ లో అనుభవం ఉన్న ప్రభగల్ దర్శకత్వంలో యువన్ , రిథాన్ కృష్ణ , అనూష సురేష్ , అమిత్ శివదాస్ నాయర్ ప్రధానపాత్రలలో మడ్ రేసింగ్ నేపథ్యం లో తెరకెక్కిన “మడ్డీ ” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు. తెలుగు భాషలో “మడ్డీ “మూవీని శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ ద్వారా మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు.

డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పూణే లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై భారీ బడ్జెట్ తో ఒక సాంగ్ ను తెరకెక్కించారు.

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన నాగశౌర్య ఇప్పుడు లక్ష్య అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈసినిమాలో నాగశౌర్య మేకోవర్ కూడా సినిమాపై మంచి క్రేజ్ ను పెంచేసింది. ఇక ఈసినిమా డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో జిబీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ ను…

"మాచర్ల నియోజకవర్గం" మూవీ లో హైలైట్ పాత్రలో కృతిశెట్టి
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.వినాయక చవితి పండగ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఛాలెంజింగ్ పాత్రలకై ఎదురుచూస్తున్నా - సత్యదేవ్
విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం”, “గాడ్సే”, “స్కైలాబ్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు” హిందీ , చిరంజీవి "గాడ్ ఫాదర్ " మూవీస్ లో సత్యదేవ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కిన “స్కైలాబ్ ” మూవీ డిసెంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు . స్కైలాబ్ " మూవీ సిట్యువేషనల్ కామెడీ మూవీ అనీ , తాను నటిస్తున్న తొలి వినోదాత్మక చిత్రమనీ , ఎక్కువగా సీరియస్ పాత్రలు చేస్తూ వచ్చాననీ , ఈ మూవీ లో తన పాత్ర ఫన్నీ గా ఉంటుందనీ, ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికాననీ చెప్పారు.