రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంగా చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైనర్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా త్వరలోనే పట్టాలెక్కించనున్నాడు. హరీష్ శంకర్ తో పవన్ రెండో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా నుండి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి చిత్రయూనిట్ లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది. మరో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లొచ్చని అంటున్నారు. మరి గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమా ప్రకటించినప్పటినుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. చూద్దాం మరి ఈసారి కూడా బ్లాక్ బస్టర్ కొడతారో లేదో..!




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: