డాక్టర్ కె రవికిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ , నిత్య మీనన్ కంపెనీ బ్యానర్స్ పై విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్కైలాబ్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ మూవీ “స్కైలాబ్ “ డిసెంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. NASA ఫస్ట్ స్పేస్ స్టేషన్ స్కైలాబ్ (1979) కూలిపోయి భూమి సర్వ నాశనం అయిపోతుందని వార్తలు రావడంతో ప్రజలంతా ఏం జరుగుతుందోనని ఆసక్తి గా ఎదురుచూసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలోని గౌరి, ఆనంద్, రామారావు జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యం లో “స్కైలాబ్ ” మూవీని దర్శకుడు వినోదాత్మంగా తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ తమన్నా చేతుల మీదుగా రిలీజ్ అయిన “స్కైలాబ్ ” మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “స్కైలాబ్ ” మూవీ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: