విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం”, “గాడ్సే”, “స్కైలాబ్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “రామ్ సేతు” హిందీ , చిరంజీవి “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో సత్యదేవ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సత్యదేవ్ కథానాయకుడిగా తెరకెక్కిన “స్కైలాబ్ ” మూవీ డిసెంబర్ 4వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు . స్కైలాబ్ ” మూవీ సిట్యువేషనల్ కామెడీ మూవీ అనీ , తాను నటిస్తున్న తొలి వినోదాత్మక చిత్రమనీ , ఎక్కువగా సీరియస్ పాత్రలు చేస్తూ వచ్చాననీ , ఈ మూవీ లో తన పాత్ర ఫన్నీ గా ఉంటుందనీ, ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికాననీ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో సత్యదేవ్ తాను నటిస్తున్న మూవీస్ గురించి మాట్లాడుతూ .. “గుర్తుందా శీతాకాలం ” తన తొలి ప్రేమకథా చిత్రమనీ , “గాడ్సే “ఒక థ్రిల్లర్ మూవీ అనీ , ఈ రెండు మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేశాననీ , తాను నటించే మూవీస్ అన్నీ విభిన్న కథాంశాలతో రూపొందుతున్నవేననీ , తాను ఎప్పుడు ఛాలెంజింగ్ పాత్రల కోసమే ఎదురు చూస్తుంటాననీ , ఎందుకంటే చేసే పాత్రల్లో సవాల్ లేకపోతే నటుడిగా సంతృప్తి దొరకదనీ , ప్రస్తుతం కొత్త తరహా పాత్రలు చేయాలనే ఆకలితో ఉన్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: