మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం “ మూవీ 2022 జనవరి 7 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానున్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా కు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్స్, ప్రొడ్యూసర్ గా బిజీగా ఉన్న హీరో రామ్ చరణ్ కొంత విరామం తీసుకుని వెకేషన్ కు స్విట్జర్లాండ్ వెళ్ళారు. స్విట్జర్లాండ్ లో ఆయన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి పర్వతాల పై ఫోజ్ ఇచ్చిన ఆయన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: