కరోనా వల్ల గత రెండేళ్లు గా సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంటుంది. పెండింగ్ లో ఉన్న సినిమాలు దాదాపు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ రెండు మూడు నెలల్లో పలు సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో రెండు మూడు సినిమాలు మినహాయించి పెద్దగా ఆడిన సినిమాలు మాత్రం ఏం లేవు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన అఖండ సినిమా మాత్రం ఇండస్ట్రీకి కొత్త ఊపునిచ్చింది అని చెప్పొచ్చు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. మరోవైపు బాలయ్య అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అఖండ విజయం సాధించడంతో పండగ చేసుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం అఖండ విజయం పై స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు రాగా ఇప్పుడు అఖండతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. మరి ఈసినిమా ఏయే ఏరియాల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘అఖండ’ ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం- 4.39 కోట్లు
సీడెడ్- 4.02 కోట్లు
యూఏ- 1.36 కోట్లు
ఈస్ట్- 1.05 కోట్లు
వెస్ట్- 0.96 కోట్లు
గుంటూరు- 1.87 కోట్లు
కృష్ణ- 0.81 కోట్లు
నెల్లూరు- 0.93 కోట్లు
ఏపీ+తెలంగాణ టోటల్ ఫస్ట్ డే కలెక్షన్స్ – 15.39 కోట్లు (23 కోట్లు గ్రాస్)
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: