డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న చిత్రం లైగర్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి.. పూరీ లాంటి డైరెక్టర్ ఒక హీరోను ఎలా చూపిస్తాడో తెలుసు కాబట్టి ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి పూరీ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందుకు తగ్గట్టే తెరకెక్కిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ను ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే మైక్ టైసన్ కు సంబంధించిన షూట్ కోసం యూఏస్ వెళ్లిన చిత్రయూనిట్ రీసెంట్ గానే అక్కడ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. దాదాపు షూటింగ్ పూర్తయినట్టే. అక్కడ మైక్ టైసన్ తో షూటింగ్ చేస్తూ పలు మెమరీస్ ను ఏర్పరుచుకున్న టీమ్ మైక్ టైసన్ తో దిగిన పిక్స్ కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఈనేపథ్యంలో మైక్ టైసన్ నుండి చిత్రయూనిట్ ఒక ప్రత్యేక బహుమతి కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. అదేంటంటే.. మైక్ టైసన్ ఆటో గ్రాఫ్ పెట్టిన బాక్సింగ్ గ్లౌజ్ లు పూరీ కి గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడట. దీంతో టీమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు సమాచారం.
కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: