
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 28


వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి

మీడియా తో "పుష్ప " మూవీ నిర్మాతల సమావేశం

మహేష్ సినిమాపై రాజమౌళి క్లారిటీ..!

"అఖండ "మూవీ USA రికార్డ్

తమన్నా రోబో లుక్

'బంగార్రాజు' టీజర్ రిలీజ్

'లైగర్' కోసం రెడీ అవుతున్న మైక్ టైసన్

పూజాహెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్

'గని' ఈశ్వర్ నాథ్ గా జగపతిబాబు

"మాచర్ల నియోజకవర్గం " మూవీ రిలీజ్ డేట్

కేతిక శర్మ స్టైలిష్ లుక్

బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం

సినిమాటోగ్రాఫర్ కు భీమ్లా నాయక్ థ్యాంక్స్

'రాధేశ్యామ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

ముంబై లో పూజాహెగ్డే డ్రీమ్ హౌస్

విష్ణు మంచు కోలీవుడ్ ఎంట్రీ
సక్సెస్ ఫుల్ "విష్ణు" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విష్ణు మంచు "ఢీ", "దేనికైనా రెడీ ", "దూసుకెళ్తా " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. విష్ణు మంచు ప్రస్తుతం" D &D డబుల్ డోస్ " మూవీ లో నటిస్తున్నారు. విష్ణుమంచు ఇప్పుడు కోలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి
హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి వరుణ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. దానికితోడు కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తుండటంతో వరుణ్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ కొత్త సినిమాతో వస్తున్నాడు.

మీడియా తో "పుష్ప " మూవీ నిర్మాతల సమావేశం
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మహేష్ సినిమాపై రాజమౌళి క్లారిటీ..!
మహేష్-రాజమౌళి కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు.. మహేష్ ను ఎలా చూపిస్తాడు లాంటి విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే మహేష్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మాత్రం తెలీదు. ఇక తాజాగా మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.

"అఖండ "మూవీ USA రికార్డ్
నందమూరి నట సింహం బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.

తమన్నా రోబో లుక్
“శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. .టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

'బంగార్రాజు' టీజర్ రిలీజ్
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బంగార్రాజు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్‌గా ఈ బంగార్రాజు రాబోతోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులు మెరుగుపడడంతో చిత్ర యూనిట్ శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో పడింది. మరో వైపు ఈసినిమానుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

'లైగర్' కోసం రెడీ అవుతున్న మైక్ టైసన్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నఈసినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. దీనిలో భాగంగానే తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.

పూజాహెగ్డే ఫిట్ నెస్ సీక్రెట్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ "భవదీయుడు భగత్ సింగ్ " మూవీస్ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

"11:11" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిల్మ్స్ బ్యానర్స్ పై కిట్టు నల్లూరి దర్శకత్వంలో సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి , వర్ష విశ్వనాథ్ జంటగా "11:11" మూవీ తెరకెక్కుతుంది. "11:11" మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

'గని' ఈశ్వర్ నాథ్ గా జగపతిబాబు
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆ వీడియోలో కీలకపాత్రలన్నీ చూపించారు. మరోవైపు ఈసినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 15న ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే తెలిపారు.

"మాచర్ల నియోజకవర్గం " మూవీ రిలీజ్ డేట్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.వినాయక చవితి పండగ రోజు “మాచర్ల నియోజకవర్గం” మూవీ షూటింగ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభం అయ్యింది. అదే రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం”…

కేతిక శర్మ స్టైలిష్ లుక్
యంగ్ హీరో ఆకాష్ పూరి, మోడల్ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో ,మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతూ డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. కేతిక కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం
నటసింహా నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేనితో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే గోపీచంద్ బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.

"లైగర్ " మూవీ కై ఎదురుచూస్తున్నా -దుల్కర్ సల్మాన్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ లో హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ…

సినిమాటోగ్రాఫర్ కు భీమ్లా నాయక్ థ్యాంక్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'రాధేశ్యామ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఒక సినిమా తరువాత మరొక సినిమా పూర్తవుతున్నాఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇందులో ఫస్ట్ లిస్ట్ లో ఉన్న సినిమా రాధేశ్యామ్. రాాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. దానికి తోడు అప్ డేట్స్ కూడా చాలా తక్కువగానే వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందుతూనే ఉన్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా నుండి అప్ డేట్ వచ్చింది. నిజానికి…

స్పీడు పెంచుతున్న శిరీష్.. 7వ సినిమాకు గ్రీన్ సిగ్నల్..!
అల్లు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ మొదట్లో చాలా స్పీడుగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే చేసేవాడు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ ఎక్కువగానే వచ్చింది. చివరగా 2019లో ABCD అనే సినిమాతో వచ్చాడు మళ్లీ ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ఇప్పటికే అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో ప్రేమ కాదంట సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ముంబై లో పూజాహెగ్డే డ్రీమ్ హౌస్
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
అల్లు అర్జున్ చేతుల మీదుగా "పుష్పక విమానం" మూవీ ట్రైలర్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణ లో ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్ , టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ , శాన్వీ మేఘన , గీత సైనీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పుష్పక విమానం" మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సునీల్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రామ్ మిరియాల సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.