వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి

Varun Sandesh Starrer Induvadana Movie Gets Censor Certified, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Induvadana Movie Gets Censor Certified, Induvadana Movie Gets Censor Report, Induvadana Movie, Varun Sandesh Induvadana Movie, Induvadana Movie Updates, Induvadana Movie Latest News, Varun Sandesh, Induvadana, Varun Sandesh New Movie, Varun Sandesh Upcoming Movie, Induvadana Telugu Movie, Varun Sandesh New Movie Induvadana

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్టు కొట్టి ఆ తర్వాత వరుస అవకాశాలను సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి వరుణ్ కు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. దానికితోడు కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తుండటంతో వరుణ్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇక చాలా గ్యాప్ తరువాత మళ్లీ కొత్త సినిమాతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎం శ్రీనివాసరాజు దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న సినిమా ఇందువదన. ఈసినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. U/A సర్టిఫికేట్ ఈసినిమాకు వచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన.

కాగా ఈసినిమాలో వరుణ్ సందేశ్ కు జోడీగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక, జెర్సీ మోహన్ తదితరులు నటిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి మాధవి ఆదుర్తి ఈసినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =