మహేష్-రాజమౌళి కాంబినేషన్ పై గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తాడు.. మహేష్ ను ఎలా చూపిస్తాడు లాంటి విషయాలు ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే మహేష్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మాత్రం తెలీదు. ఇక తాజాగా మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7న రిలీజ్ కానుంది. దీంతో రాజమౌళి తో పాటు చిత్రయూనిట్ అందరూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇక ఈసందర్భంగా రాజమౌళి మరోసారి మహేష్ సినిమా గురించి చెబుతూ క్లారిటీ ఇచ్చాడు. నా నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతో ఉంటుంది. ఈ విషయాన్ని ఇది వరకే చెప్పేశాను. అయితే ఇప్పుడా సినిమా గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై.. అందరూ సినిమాను ఆదరించి బ్రహ్మాండంగా ఉందని చెప్పిన తర్వాతే మహేష్ సినిమా గురించి ఆలోచిస్తాను అని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.
కాగా ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ఇది. కాగా ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ఇది. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు కథల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈసినిమాను విడుదల చేస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























