
ట్యాగ్ · 151 కథనాలు · పేజీ 7


జిమ్ లో నాని సెల్ఫీ

చిరంజీవి కి జోడీగా శృతి హాసన్ ?

ప్రేమకు అడ్డంకులు ఉండవు -నితిన్

'థమన్' కు కరోనా పాజిటివ్

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్

దుబాయ్ లో లేడీ సూపర్ స్టార్ తో మెహరీన్

ప్రభాస్ పై 'ఆది పురుష్' డైరెక్టర్ ప్రశంసలు

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'

అల్లు అర్జున్ పై ఆర్ జి వి ప్రశంసలు

'జాతి రత్నాలు' తో థమన్.. చాలా నవ్వుకున్నా

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ

అఫీషియల్.. సంక్రాంతి బరిలోకి 'బంగార్రాజు'

'డీజే టిల్లు' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్

నాలుగు నెలలలో కృతిశెట్టి మూడు సినిమాలు రిలీజ్

'కాతు వాకుల రెండు కాదల్'.. నెగిటివ్ రోల్ లో సామ్
టాలీవుడ్ లో తన పాత్రల ద్వారా... తన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత. ఇప్పుడు సమంత తన పంథాను పూర్తిగా మార్చేసింది. కేవలం సినిమాల్లో హీరో పక్కన హీరోయిన్ గా మాత్రమే చేయకుండా సినిమా మొత్తం తన మీదే నడిచే సినిమాలను సైతం చేస్తుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ లో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అయితే తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. యశోద సినిమా షూటింగ్ దశలో ఉంది.

మెగా స్టార్ కోసమే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ - రెజీనా
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

జిమ్ లో నాని సెల్ఫీ
హారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో , తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. రెండు విభిన్న పాత్రలలో నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

చిరంజీవి కి జోడీగా శృతి హాసన్ ?
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ప్రేమకు అడ్డంకులు ఉండవు -నితిన్
కరోనా మహమ్మారి విజృంభించి సాధారణ ప్రజలతో పాటు సినీ , రాజకీయ ప్రముఖులపై ప్రతాపం చూపుతున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాజిటివ్ వార్త షాక్ ఇవ్వగా తరువాత యంగ్ హీరో నితిన్ తన భార్య కూడా కోవిడ్-19 తో ఐసోలేషన్ లో ఉన్నట్టుగా తెలిపారు. ఆమెకి కరోనా సోకి హోమ్ క్వారంటైన్ లో ఉండగా పుట్టిన రోజు కావడంతో హీరో నితిన్ కేక్ కట్ చేసి తన భార్యకు శుభాకాంక్షలు తెలిపారు.

'థమన్' కు కరోనా పాజిటివ్
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మళ్లీ సెలబ్రిటీల పై బాాాగానే పడుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పి షాకిచ్చారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయ్. దీనితో నేను నా ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటున్నా. వైద్యుల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నా. నాతో కొన్నిరోజులుగా కాంటాక్ట్ లో ఉన్నవారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ తెలిపారు. అలా చెప్పారో లేదో ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా కరోనా బారిన పడ్డారు.

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొంత లక్ అనేది మాత్రం ఉండాలి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో అలాంటి అదృష్టం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పొచ్చు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు…

'సర్కారు వారి పాట'.. సంక్రాంతి నుండి అప్ డేట్స్ షురూ
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే ప్లాన్ లోనే ముందు నుండి ఉన్నారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వల్ల ఈసంక్రాంతికి రాలేకపోయింది. కొన్నాళ్లు కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఆ తరువాత షూటింగ్ ను మొదలు పెట్టి దాదాపు చాలా వరకూ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మధ్య మధ్యలో ఏదో ఒక అప్ డేట్ కూడా ఇస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి బ్లాస్టర్ పేరుతో రిలీజ్ అయిన వీడియో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. అయితే గత కొద్దిరోజులుగా షూట్ కు మళ్లీ బ్రేక్ పడింది. మహేష్ మోకాలికి చిన్న సర్జరీ…

దుబాయ్ లో లేడీ సూపర్ స్టార్ తో మెహరీన్
సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. ఒక కన్నడ మూవీ, హవీష్ కోనేరు హీరోగా ఒక మూవీ కి మెహరీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి “F 3” మూవీ తరువాత హీరో బాలకృష్ణ కథానాయకుడిగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ లో కథానాయికగా మెహరీన్ ఒక బంపర్ ఆఫర్ అందుకున్నట్టు సమాచారం.

ప్రభాస్ పై 'ఆది పురుష్' డైరెక్టర్ ప్రశంసలు
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి బాహుబలి, సాహో సినిమాల తరువాత ప్రభాస్ మార్కెటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాదు ప్రభాస్ సినిమాలు చేయడానికి కేవలం తెలుగు నుండే కాదు నార్త్ లో కూడా పోటీ పెరిగింది. ఇక నార్త్ లో కూడా ఎంతోమంది ప్రభాస్ తో సినిమా చేయడానికి పోటీ పడగా ఆ అవకాశం మాత్రం ఓం రౌత్ కు మాత్రమే దక్కింది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆది పురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

'మానాడు' హక్కులను దక్కించుకున్న 'సురేష్ ప్రొడక్షన్స్'
దగ్గుబాటి వారి హోమ్ బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుండి ఈ బ్యానర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించింది.. అందిస్తూనే ఉంది. ఇక ఈ బ్యానర్ నుండి స్ట్రయిట్ సినిమాలు ఎలా అయితే వస్తాయో రీమేక్ సినిమాలు కూడా అలానే వస్తాయి. ఇప్పటి వరకూ ఇతర భాషల్లోని ఎన్నో సినిమాలను రీమేక్ చేశారు. ఇక ఈనేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా రీమేక్ లను సొంతం చేసుకుంది ఈ బ్యానర్. ఆ సినిమా మరేదో కాదు ఇటీవలే రిలీజ్ అయిన మానాడు.

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'
టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇక దీనికి అనుసంధానంగా రీసెంట్ గా గీతా ఆర్స్ట్ 2 కూడా వచ్చింది. ఈ బ్యానర్ నుండి ఇప్పటివరకూ అరడజను వరకూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా దాదాపు అన్నీ సక్సెస్సే అయ్యాయి. అంతేకాదు ఈ బ్యానర్ లో యంగ్ హీరోలకు.. కొత్త టాలెంట్ కు ఛాన్స్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

అల్లు అర్జున్ పై ఆర్ జి వి ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా సుమారు 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ పైగా రాబట్టింది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్…

'జాతి రత్నాలు' తో థమన్.. చాలా నవ్వుకున్నా
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న లాంగ్వేజ్ బారియర్స్ అనేవి దాదాపు చాలా వరకూ తొలగిపోయాయి. మన వాళ్లు ఇతర వాళ్లను తీసుకోవడం.. ఇప్పుడు మన వాళ్లు కూడా వేరే లాంగ్వేజస్ లో చేయడం.. ఇంకా విచిత్రం ఏంటంటే.. తమిళ్ హీరోలు డైరెక్ట్ గా తెలుగు సినిమాలను చేయడం.. దానికి తెలుగు డైరెక్టర్స్ దర్శకత్వం వహించడం ఇలా చాలా ఈక్వేషన్స్ ను చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మరో కాంబినేషన్ కూడా రెడీ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి అనుదీప్ డైరెక్షన్ లో తమిళ్ స్టార్ కార్తికేయ హీరోగా సినిమా వస్తుంది. ఈ సినిమా తోనే టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఎంట్రీ…

రాజమౌళి కి బిర్యాని.. చరణ్ కి పానీ పూరీ
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. అన్నీ అనుకున్నట్టు ఉండి ఉంటే రేపు రిలీజ్ అయి ఉండేది. కానీ అందరినీ నిరాశ పరస్తూ మళ్లీ వాయిదా పడింది. ఒమిక్రాన్ ప్రభావం రోజు రోజుకి పెరగడంతో.. కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూసేయడంతో ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

"అఖండ"మూవీ ఓటీటీ రిలీజ్ డేట్
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా అఖండ ” నిలిచింది. 34 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 68 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

అఫీషియల్.. సంక్రాంతి బరిలోకి 'బంగార్రాజు'
ఈ ఏడాది సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది అని.. ఏ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఒక సినిమా తరువాత మరొకటి వరుసగా వాయిదా పడుతూ.. ఇప్పుడు ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కు లేకుండా పోయాయి. ఇక నిన్నటి వరకూ రిలీజ్ అవుతుందిలే అనుకున్న రాధేశ్యామ్ కూడా నేడు రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా నిరాశే ఎదురైంది. ఇక పెద్ద సినిమాలు పోటీకి లేకపోవడంతో ఏ ఏడాది లేనంతగా ఈ ఏడాది చిన్న సినిమాలకు ఛాన్స్ దొరికింది. దీంతో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ గురించి అనుపమ పరమేశ్వరన్
సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన “రౌడీ బాయ్స్ ‘మూవీ జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'డీజే టిల్లు' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్
టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ దాదాపు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమా కూడా థమన్ ను తమ ప్రాజెక్ట్ లో జాయిన్ చేసుకుంది. నిజానికి ఇప్పటికే ఈసినిమా కోసం నార్త్ కు వేరే, సౌత్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అయినా కూడా ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం స్పెషల్ గా థమన్ ను తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. థమన్ పై ఎంత నమ్మకం ఉందో. ప్రస్తుతం అయితే థమన్ పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.

నాలుగు నెలలలో కృతిశెట్టి మూడు సినిమాలు రిలీజ్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి "ఉప్పెన ", “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.