బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్ని నాయనా”మూవీ సీక్వెల్ “బంగార్రాజు”మూవీ లో కృతిశెట్టి , నాగచైతన్య కు జోడీగా నటించారు. “బంగార్రాజు”మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు , కృతిశెట్టి జంటగా తెరకెక్కుతున్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి “మూవీ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో రిలీజ్ కానుంది. ఎమ్ ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో నితిన్ , కృతిశెట్టి జంటగా తెరకెక్కిన “మాచర్ల నియోజకవర్గం “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. 2022 సంవత్సరంలో నాలుగు నెలలలో మూడు సినిమాలతో కృతిశెట్టి ప్రేక్షకులను అలరించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: