అఫీషియల్.. సంక్రాంతి బరిలోకి ‘బంగార్రాజు’

Bangarraju Release Confirmed For Sankranthi,Bangarraju Release For Sankranthi,Bangarraju Sankranthi Release,Latest 2022 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2022 Latest Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Krithi Shetty,Ramya Krishna,Nagarjuna Bangar Raju Movie Latest Update,Nagarjuna Bangarraju Movie Release Date Latest Update,Nagarjuna Bangarraju Movie Release Date Update,Nagarjuna Bangarraju Release Date Update,Nagarjuna Bangarraju Release Date,Bangarraju Movie Update,Bangarraju Movie Release Date Update,Bangarraju Movie Latest Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Updates,Nagarjuna Movie Updates,Bangarraju Updates,Bangarraju Update,Bangarraju Latest Update,Bangarraju Movie Release Date,Bangarraju Sankranthi,Bangarraju Release Date Update,Bangarraju Songs,Bangarraju Movie Songs,Bangarraju First Look,Bangarraju Teaser,Bangarraaju On Jan 14th,Bangarraaju From Jan 14th,Bangarraaju Releasing On Jan 14th,Bangarraaju Release Date Fix,#Bangarraju,#BangarrajuOnJan14th

ఈ ఏడాది సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది అని.. ఏ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఒక సినిమా తరువాత మరొకటి వరుసగా వాయిదా పడుతూ.. ఇప్పుడు ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కు లేకుండా పోయాయి. ఇక నిన్నటి వరకూ రిలీజ్ అవుతుందిలే అనుకున్న రాధేశ్యామ్ కూడా నేడు రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా నిరాశే ఎదురైంది. ఇక పెద్ద సినిమాలు పోటీకి లేకపోవడంతో ఏ ఏడాది లేనంతగా ఈ ఏడాది చిన్న సినిమాలకు ఛాన్స్ దొరికింది. దీంతో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో కాస్త పెద్ద సినిమా బంగార్రాజు. గత కొద్ది రోజులుగా ఈసినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. చిత్రయూనిట్ కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుంది అన్నారు కానీ డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు. దీంతో ఈసినిమాపై కూడా పలు అనుమానాలు ఉండగా ఇప్పుడు ఆ అనుమానాలన్నింటినీ తొలగించారు మేకర్స్. ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున-నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో నాగచైతన్య కి జోడీగా కృతి శెట్టి నటించనున్న సంగతి కూడా తెలిసిందే. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =