దగ్గుబాటి వారి హోమ్ బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఏళ్ల నుండి ఈ బ్యానర్ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించింది.. అందిస్తూనే ఉంది. ఇక ఈ బ్యానర్ నుండి స్ట్రయిట్ సినిమాలు ఎలా అయితే వస్తాయో రీమేక్ సినిమాలు కూడా అలానే వస్తాయి. ఇప్పటి వరకూ ఇతర భాషల్లోని ఎన్నో సినిమాలను రీమేక్ చేశారు. ఇక ఈనేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా రీమేక్ లను సొంతం చేసుకుంది ఈ బ్యానర్. ఆ సినిమా మరేదో కాదు ఇటీవలే రిలీజ్ అయిన మానాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకట్ ప్రభు డైరెక్షన్లో శింబు హీరోగా ‘మానాడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా రీమేక్ హక్కులతో పాటు, అన్ని భాషల డబ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.
— Suresh Productions (@SureshProdns) January 6, 2022
ఇక ఈసినిమాలో రానా హీరోగా నటిస్తాడన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. తమిళ్ వర్షన్ డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభునే తీసుకుంటారా లేక వేరే తెలుగు డైరెక్టర్ ని తీసుకుంటారా చూడాలి. చూద్దాం మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: