హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా అఖండ ” నిలిచింది. 34 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 68 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అఖండ”మూవీ ఇప్పటికీ పలు ఏరియాల్లో మంచి షేర్ ను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ ను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించారు. సంక్రాంతికి థియేటర్స్ లో “అఖండ” ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం . తాజాగా ఈ సినిమాను 21 జనవరి న విడుదల చేయబోతున్నట్లుగా హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. నాలుగు వారాల గ్యాప్ లో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సిన “అఖండ “మూవీ ఏడు వారాల తరువాత విడుదల కావడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: