
ట్యాగ్ · 394 కథనాలు · పేజీ 3


"బ్రో" మూవీ విజయోత్సవ వేడుక

సెకండ్ షెడ్యూల్ లో 'భోళా శంకర్'

తగ్గేదేలే అంటున్న 'భీమ్లా నాయక్' మేకర్స్

అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు

మెగా రికార్డ్

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి

"అఖండ" మూవీ కై అఘోరాల ఆగమనం

అల్లు అర్జున్ కు రష్మిక స్పెషల్ గిఫ్ట్

"అఖండ"మూవీ పై కళ్యాణ్ రామ్ కామెంట్స్

'పుష్ప'.. ట్రైలర్ ముందే సర్ ప్రైజ్

స్పీడు పెంచుతున్న 'చిరు'..!

"అఖండ"మూవీ పై ఎన్టీఆర్ స్పందన

వెంకీ తో కూడా చేస్తున్నా..!

'భీమ్లా నాయక్'.. రానా బర్త్ డే స్పెషల్ టీజర్ రిలీజ్
సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. పవర్ స్టార్ సినిమా అంటేనే దానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక పవన్ కు రానా లాంటి హీరో తోడైతే ఇంకెలా ఉంటుంది. ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అలానే కనిపిస్తుంది. ఈసినిమా నుండి రిలీజ్ అయిన పవన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే రికార్డులు క్రియేట్ చేశారు. ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

"బ్రో" మూవీ విజయోత్సవ వేడుక
జేజేఆర్ రవిచంద్ నిర్మాతగా కార్తిక్ తుపురాని దర్శకత్వంలో నవీన్‌చంద్ర, అవికాగోర్ ప్రధాన పాత్రలలో అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో తెరకెక్కిన "బ్రో " మూవీ సోనిలివ్ ఓటీటీ ద్వారా నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవీన్ చంద్ర , అవికా గోర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

సెకండ్ షెడ్యూల్ లో 'భోళా శంకర్'
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు కాదు.. ఈయన ఏకంగా 4 సినిమాలు చేస్తున్నాడు. అందులో ఆచార్య సినిమా ఇప్పటికే షూటింగ్ ను సైతం ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ కూడా సిద్ద అనే కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4, 2022న విడుదల కానుంది ఈ చిత్రం.

తగ్గేదేలే అంటున్న 'భీమ్లా నాయక్' మేకర్స్
సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాకు ఇది రీమేక్ అని తెలిసిందే. ఇక ఈసినిమాను మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను యాడ్ చేసి తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు, టీజర్ చూస్తే ఈ విషయం ఇప్పటికే అర్థమైపోయింది. ఇక ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఈసినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్.

అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

మెగా రికార్డ్
10 సంవత్సరాల గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150" మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని తన స్టామినా నిరూపించుకున్నారు. తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి కథానాయకుడిగా "ఆచార్య ", "గాడ్ ఫాదర్ ", "భోళా శంకర్ ", చిరంజీవి 154 మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి.

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి
డిసెంబర్ నెలలో 4 స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు లో 2 , హిందీ లో 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి.

'అఖండ' పై కలెక్షన్ కింగ్ ప్రశంసలు
కరోనా తరువాత కూడా మంచి సక్సెస్ రేటు ఉన్న సిని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ అని చెప్పొచ్చు. కరోనా సమయంలో అన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మనవాళ్లు ఎక్కడా తగ్గకుండా కాస్త పరిస్థితులు మెరుగుపడగానే సినిమాలు పూర్తి చేసుకున్నారు.. రిలీజ్ లు చేశారు. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా అంటే అంతే ప్రేమతో ఉంటారు. తెలుగు సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ విషయంలో అది మరోసారి రుజువు చేశారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీకి మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

"అఖండ" మూవీ కై అఘోరాల ఆగమనం
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , జగపతి బాబు , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “అఖండ”మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో…

తెలుగు ఆడియన్స్ కు బోయపాటి స్పెషల్ థ్యాంక్స్..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా అఖండ సందడే కనిపిస్తుంది. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఈనెల 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. ఇక ఈసినిమా కూడా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. దీంతో అభిమానుల ఆనందానికి అయితే హద్దులు లేకుండా పోయాయి. అఖండ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం.. దానికి తోడు కలెక్షన్స్ కూడా భారీగా వస్తుండటంతో ముందు ముందు రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా కాస్త ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ కు రష్మిక స్పెషల్ గిఫ్ట్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “పుష్ప: ది రైజ్” మూవీ లో ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్ , సునీల్, అనసూయ ముఖ్య పాత్రలలో నటించగా , స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు.

"అఖండ"మూవీ పై కళ్యాణ్ రామ్ కామెంట్స్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'పుష్ప'.. ట్రైలర్ ముందే సర్ ప్రైజ్
ఈ ఏడాది వస్తున్న పెద్ద సినిమాల్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా ఒకటి. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికితోడు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న సినిమా అవ్వడం.. ఇంకా ఫస్ట్ టైమ్ ఓ డిఫరెంట్ పాత్రలో బన్నీ నటిస్తుండటం ఇలా చాలా కారణాలే ఉన్నాయి ఈసినిమాపై అంచనాలు పెరగడానికి. మరోపక్క ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ బాగా ఆకట్టుకోగా.. పాటలు అయితే ఒక రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఎక్కడ చూసినా సామి సామి, శ్రీ వల్లి పాటలే వినిపిస్తున్నాయి.

స్పీడు పెంచుతున్న 'చిరు'..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా.. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకంటే ఫాస్ట్ గానే తమ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. పాతతరంలో అయితే ఏడాదికి 10 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాను రాను ఆసంఖ్య తగ్గినా తరువాత హీరోలు కనీసం నాలుగైదు సినిమాలు అయినా చేసేవాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. స్టార్ హీరోలయితే ఏడాదికి ఒక సినిమా చాలు అన్నట్టు గా చేస్తున్నారు.

మోహన్ లాల్ 'మరక్కార్' రివ్యూ
ఇక సాంకేతిక విభాగం ఈసినిమాకు ప్రధాన బలం. తిరు సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. వార్ సీన్స్ తో పాటు సముద్రంలోని పోరాట సన్నివేశాలు తీసిన విధానం మూవీకి హైలైట్ గా నిలిచాయి. సంగీతం బాగుంది. రాహుల్ రాజ్, అంకిత్ సూరి, రోనీ రాఫెల్, లియెల్ ఎవాన్స్ రోడర్ సమకూర్చిన సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ మాత్రం ఎక్కడా రాజీ పడలేదన్న విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంత రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే పీరియాడిక్ సినిమాలు ఇష్టపడేవారికి ఈసినిమా నచ్చుతుంది అని చెప్పొచ్చు.

రష్మిక హార్డ్ వర్క్ & డెడికేషన్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

వన్ మిలియన్ లైక్స్ తో నాటు నాటు సాంగ్ రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

"అఖండ"మూవీ పై ఎన్టీఆర్ స్పందన
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో బాలకృష్ణ తన నట విశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు బోయపాటి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా "అఖండ"మూవీని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.

'అఖండ' రివ్యూ- విశ్వరూపం చూపించిన బాలయ్య
ఫైనల్ గా చెప్పాలంటే అఖండ ఫుల్ మాస్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదే. తమ హీరోను చూసి పండగ చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వెంకీ తో కూడా చేస్తున్నా..!
మల్టీ స్టారర్ సినిమాలంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ స్టార్ హీరోలయితే ఆ క్రేజ్ ఇంకా ఉంటుంది. మరి అలా కాకుండా అగ్రహీరోలు అందులోనూ వేరే ఇండస్ట్రీ వాళ్లతో కలిసి చేస్తే వచ్చే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఉపోద్ఘాతం ఎందుకంటే మోహన్ రాజా దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో మోహన్ రాజా గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మలయాళ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.