జేజేఆర్ రవిచంద్ నిర్మాతగా కార్తిక్ తుపురాని దర్శకత్వంలో నవీన్‌చంద్ర, అవికాగోర్ ప్రధాన పాత్రలలో అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో తెరకెక్కిన “బ్రో ” మూవీ సోనిలివ్ ఓటీటీ ద్వారా నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవీన్ చంద్ర , అవికా గోర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోమవారం హైదరాబాద్‌లో “బ్రో” మూవీ విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఆ వేడుకలో నవీన్ చంద్ర మాట్లాడుతూ .. చాలా కాలం గుర్తుండిపోయే మంచి సినిమా ఇది. అవికాతో తన కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మరాఠీలో రూపొందిన “హ్యాపీ బ్రదర్” మూవీ కి రీమేక్ ఇదనీ , తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించామనీ , నవీన్‌చంద్ర,అవికాగోర్ తమ నటనతో సినిమాకు ప్రాణంపోశారనీ తెలిపారు. అవికా గోర్ మాట్లాడుతూ .. చాలెంజింగ్‌గా భావించి చేసిన సినిమా ఇదనీ ,తన కెరీర్‌లో మంచి సినిమాల్లో ఒకటిగా నిలవడం ఆనందంగా ఉందనీ , తన పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: