ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈసినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: మోహన్‌లాల్, సుహాసిని, ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్, కీర్తిసురేష్, అర్జున్ సర్జా, సునీల్‌శెట్టి, మంజు వారియర్ తదితరులు
దర్శకత్వం: ప్రియదర్శన్
సంగీతం: రోనీ రాఫెల్
నేపథ్య సంగీతం: రాహుల్ రాజ్, అంకిత్ సూరి, లైల్ ఎవ్‌నాస్ రోడర్
సినిమాటోగ్రఫి: తిరునావుక్కరసు
నిర్మాణం: ఆంటోనీ పెరంబవూర్
తెలుగు రిలీజ్: సురేష్ ప్రొడక్షన్స్
కథ
మహమ్మద్ అలీ అలియాస్ కుంజాలి మరక్కార్ (మోహన్‌లాల్) సముద్ర యుద్ధ విన్యాసాల్లో ఆరితేరినవాడు. కొచ్చిన్‌పై పోర్చుగీసుల దాడికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో మరక్కార్ తన మొత్తం కుటుంబాన్ని కోల్పోవడంతో పాటు ఆ తర్వాత కుంజలి మరక్కార్ పరారీలో ఉంటాడు. అప్పటినుండి పోర్చుగీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అదే సమయంలో కొచ్చిన్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీస్ సైన్యం ప్లాన్ తో రెడీగా ఉంటుంది. ఈ క్రమంలో సముద్ర విన్యాసాల్లో ఆరితేరిన మరక్కార్ ను కొచ్చిన్ రాజు సమూతిరి (నెడుముడి వేణు) అతన్ని తన సముద్ర సైన్యానికి లెఫ్టినెంట్‌గా నియమిస్తాడు. మరి కుంజాలి మరక్కార్ పోర్చుగీసు వారితో సముద్రంలో ఎలా పోరాటం చేశాడు? ఆ యుద్దంలో గెలిచాడా…లేదా..? అన్నది మిగిలిన కథ
విశ్లేషణ..
ఇప్పుడు ఒక భాషలో సినిమాలు మరో భాషలో రిలీజ్ అవ్వడం కామన్ అయిపోయింది. అందులోనూ మొహన్ లాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి అభిమానమే. అందుకే తన సినిమాలు కూడా ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మరక్కార్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కథ కంజారీ యువకుడిగా ఉన్నప్పటి నుండి వీర మరణం వరకూ సాగుతుంది. పోర్చుగీసు సైనికుల దాడి నుండి ప్రాణాలను దక్కించుకున్న కంజారీ ఆ తర్వాత రాబిన్ హుడ్ తరహాలో ప్రజలను ఆదుకోవడం, వెన్నుపోటు దారుల నుండి తప్పించుకోవడం, ఆక్రమంలో పలు హత్యలు చేయడం.. చివరకు పోర్చుగీసు వారి చేతికి చిక్కి, వీరమరణం పొందడం. ఇలాంటి కథను చెప్పాలంటే నిడివి ఎక్కువగా ఉంటుంది.. అందుకే మూడు గంటలు తీసుకున్నాడు ప్రియదర్శన్. హీరోయిజం, డ్రామా, సెంటిమెంట్, కుట్రలు ఇలా అన్ని కలిపి చూపించాడు ప్రియదర్శన్. విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ , యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచాయి.
ఇక మోహన్ లాల్ నటన గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే తన హావభావాలతోనే నడిపించేస్తారు. ఈసినిమాలో కూడా మోహన్‌లాల్ పాత్రే కీలకం. ఎప్పటిలాగే తన పాత్రకు తను న్యాయం చేశారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోహన్ లాల్ యువకుడి పాత్రలో చేసిన మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ గురించి. జూనియర్ కంజారీ పాత్రలో ప్రణవ్ చాలా బాగా నటించాడు. అతని ప్రేయసి పాత్రలో కల్యాణి ప్రియదర్శిని నటించింది. ప్రణవ్, ప్రియదర్శిని జోడీ ఆకట్టుకుంటుంది. కంజారీ స్నేహితుడు చింగారిగా థాయ్ లాండ్ నటుడు జయ్ జె జక్రిత్, అతని ప్రియురాలిగా కీర్తి సురేష్ నటించారు.
అర్జున్, సునీల్‌శెట్టి, నెడుముడి వేణు, సుహాసిని, ప్రభు, మంజు వారియర్ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఇక సాంకేతిక విభాగం ఈసినిమాకు ప్రధాన బలం. తిరు సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. వార్ సీన్స్ తో పాటు సముద్రంలోని పోరాట సన్నివేశాలు తీసిన విధానం మూవీకి హైలైట్ గా నిలిచాయి. సంగీతం బాగుంది. రాహుల్ రాజ్, అంకిత్ సూరి, రోనీ రాఫెల్, లియెల్ ఎవాన్స్ రోడర్ సమకూర్చిన సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ మాత్రం ఎక్కడా రాజీ పడలేదన్న విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. నిర్మాణ విలువలు అంత రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే పీరియాడిక్ సినిమాలు ఇష్టపడేవారికి ఈసినిమా నచ్చుతుంది అని చెప్పొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: