‘అఖండ’ రివ్యూ- విశ్వరూపం చూపించిన బాలయ్య

Akhanda Movie Review Balayya Roars At Theaters,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Dwaraka Creations,Akhanda Movie Updates,Akhanda Movie Update,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Telugu Movie Updates,Akhanda Movie Live Updates,Akhanda Latest Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Movie Latest News,Akhanda Public Talk,Akhanda Movie Public Talk,Akhanda Public Response,Akhanda Movie Public Response,Akhanda Movie Review And Rating,Akhanda Review And Rating,Akhanda Movie Rating,Akhanda Movie Public Talk And Public Response,Akhanda Public Talk And Public Response,Akhanda Telugu Movie Live Updates,Balakrishna Akhanda Movie Review,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna Akhanda Movie Updates,Akhanda Movie Trailer,Akhanda Trailer,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Pragya Jaiswal New Movie,Boyapati Srinu Movies,BB3,Latest Telugu Reviews,Latest Telugu Movie 2021,Telugu Movie Reviews,Latest Tollywood Review,Latest Telugu Movie Reviews,2021 Latest Telugu Movie Reviews,Latest Movie Reviews,New Telugu Movie,New Telugu Movies 2021,Telugu Reviews,Akhanda Songs,Akhanda Movie Songs,Akhanda Teaser,Akhanda Movie Teaser,Balakrishna New Movie Review,#Akhanda

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ధియేటర్లలో రిలీజైన పెద్ద సినిమా ఇదే మరి ఈసినిమా ఎలా ఉందో.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు -బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్, శ్రీకాంత్, పూర్ణ, జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ తదితరులు
దర్శకుడు -బోయపాటి శ్రీను
నిర్మాత -మిర్యాల రవీందర్ రెడ్డి
సంగీతం -థమన్
సినిమాటోగ్రఫి-సి.రాంప్రసాద్

కథ

మురళీ కృష్ణ (బాలకృష్ణ) పేదవారికి అండగా ఉంటూ ఎవరికి అన్యాయం జరిగినా సహించడు. మరోవైపు
కలెక్టర్ గా ఆ ఊరికి శరణ్య (ప్రగ్యా జైశ్వాల్) వస్తుంది. మురళీ కృష్ణ మంచితనం, ఊరికోసం, ప్రజల కోసం ఆయన చేస్తున్న మంచి పనులను చూసి ప్రేమలో పడుతుంది. అదే ఊరిలో వరదరాజులు (శ్రీకాంత్) అక్రమ మైనింగ్ జరుపుతుంటాడు. తను చేస్తున్న అక్రమాలకు అడ్డొస్తున్నవారిని హతమారుస్తుంటాడు. ఇక మైనింగ్ వల్ల ప్రజలకు పలు ఇబ్బందులు వస్తుండటంతో మురళీకృష్ణ అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. తనను కేసులో ఇరికిస్తారు. అంతటితో ఆగకుండా మురళీకృష్ణ ఫ్యామిలీని కూడా చంపాలనే ప్రయత్నంలో…అఖండ ఎంట్రీ ఇచ్చి వారిని కాపాడుతాడు. అసలు అఖండ ఎవరు.? వరదరాజులను, అతని వెనుకున్న వారిని ఎలా అడ్డుకుంటాడు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటనేది మిగతా కథ.

విశ్లేషణ..

బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈసినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఇక వారి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ అఖండ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి గ్యాప్ ఇచ్చినా కూడా బాలయ్య మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చినట్టే తెలుస్తుంది అఖండ సినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే. నిజానికి ఈసినిమాపై ముందు నుండి మంచి అంచనాలే ఉన్నాయి. దానికి కారణం బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడమే. సింహా లో లెజెండ్ లో బాలయ్యను ఏ రేంజ్ లో చూపించాడో చూశాం కదా. అందుకు మరింత రెట్టింపును బాలయ్యను ఈసినిమాలో చూపించినట్టు చూశాం.

గత రెండు సినిమాల్లోలాగే ఈసినిమాలో కూడా మాస్ ఆడియన్స్‌ మెచ్చేలా కిక్కిస్తూ బోయపాటి తన మార్క్ ను మరోసారి చూపించాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను బోయపాటి రూపొందించగా.. ఫ్యాన్స్ ను మెప్పించడానికి బాగానే కష్టపడ్డాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఎత్తైతే సెకండ్ హాఫ్ మరో ఎత్తుగా ఉంటుంది. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో మూవీ అంటే అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఏమేం ఎక్స్ పెక్ట్ చేస్తారో అవన్నీ అఖండలో ఉంటాయి.

ఇక బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పాత్రలు తనకు కొత్తేమీ కాదు. ద్విపాత్రాభినయం ఇప్పటికే చాలా సినిమాల్లో చేశాడు.. ఈసినిమాలో కూడా ఎప్పటిలాగే తన నటనతో విజృంభించాడు. అఖండగానూ, మురళీకృష్ణ పాత్రలోనూ బాలకృష్ణ పర్ఫెక్ట్ గా చేశాడు. అయితే మొదటి సారి అఘోరా పాత్రలో కనిపించి విశ్వరూపం చూపించాడు. బాలకృష్ణ అఘోరా పాత్ర సినిమాకే హైలెట్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఈసినిమాలో చెప్పుకోవల్సిన మరో పాత్ర శ్రీకాంత్ ది. విలన్ పాత్రకు తను పూర్తి న్యాయం చేశాడు. అతి క్రూరమైన విలన్ పాత్రలో శ్రీకాంత్ ను చూపించడంతో బోయపాటి సక్సెస్ అయ్యాడు. బాల‌కృష్ణతో తొలిసారి ఎదురుప‌డే స‌న్నివేశం, అఘోరాతో త‌ల‌ప‌డే స‌న్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. లెజెండ్ సినిమాతో జగపతి బాబు సినీ కెరీర్ టర్న్ అవుతుందో.. ఈసినిమాలో శ్రీకాంత్ పాత్ర వల్ల ముందు ముందు శ్రీకాంత్ కూడా బిజీ విలన్ అవుతాడేమో చూడాలి. ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ పాత్రలు కూడా ఏదే వచ్చి వెళ్లాయి అన్నట్టు కాకుండా వాటికి కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. ప్రగ్యా జైస్వాల్‌తోపాటు పూర్ణ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా సినిమాలో కీల‌క‌మైన‌వే. జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు.

ఇక ఈసినిమాకు మరో హైలెట్ థమన్ మ్యూజిక్. ప్రమోషన్స్ లో భాగంగా థమన్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పినట్టే ఈ సినిమాకు తను ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ఆదిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్. నిర్మాణ విలువలు సినిమా రేంజ్ కు తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే అఖండ ఫుల్ మాస్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదే. తమ హీరోను చూసి పండగ చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + seventeen =