మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పన లో చంద్రబోస్ రచన , మౌనిక యాదవ్ గానం చేసిన “సామీ సామీ” అనే మాస్ సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. “సామీ సామీ” సాంగ్ లో అద్భుత డ్యాన్సర్ అల్లు అర్జున్ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా రష్మిక 18 గంటల పాటు డ్యాన్స్ రిహార్సల్స్ లో పాల్గొన్నారని సమాచారం. రష్మిక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంది. రష్మిక హార్డ్ వర్క్ & డెడికేషన్ కు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: