కరోనా తరువాత కూడా మంచి సక్సెస్ రేటు ఉన్న సిని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ అని చెప్పొచ్చు. కరోనా సమయంలో అన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మనవాళ్లు ఎక్కడా తగ్గకుండా కాస్త పరిస్థితులు మెరుగుపడగానే సినిమాలు పూర్తి చేసుకున్నారు.. రిలీజ్ లు చేశారు. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా అంటే అంతే ప్రేమతో ఉంటారు. తెలుగు సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ విషయంలో అది మరోసారి రుజువు చేశారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీకి మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా బ్లాక్ బస్టర్ తో కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇక సెలబ్రిటీలు కూడా ఈసినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరిపోయారు. ఈసినిమాను, చిత్రయూనిట్ ను అభినందించారు. సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు, చూడరు అనుకుంటున్న క్లిష్టపరిస్థితుల్లో అఖండ విజయం సాధించిన “అఖండ” సినిమా, సినీ పరిశ్రమకి ఊపిరి పోసింది, విడుదలకి సిద్దంగా ఉన్న చాలా సినిమాలకి ధైర్యాన్నిచ్చింది.. నా సోదరుడు బాలకృష్ణకు అలానే చిత్ర దర్శకుడు, నిర్మాతకి, ఈసినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.. మంచి సినిమాను ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: