మెగాస్టార్ చిరంజీవి కూడా ఫుల్ స్పీడుమీదున్నారు. అలా ఆచార్య అయిందో లేదో అప్పుడే మరో సినిమాను లైన్ లో కూడా పెట్టేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు హీరోగా లూసిఫర్ రీమేక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసి ఫైనల్ గా షూటింగ్ ను షురూ చేశారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ నేతృత్వంలో నిర్మించిన భారీ సెట్‌పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం స్టార్టింగ్ స్టార్టింగే చిరు యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వ నేతృత్వంలో చిరు యాక్షన్ సీక్వెన్స్ ను చేస్తున్నట్టు సమాచారం.
కాగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమా కోసం నయనతార ను తీసుకోనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసందే. అంతేకాకుండా వివేక్ ఒబేరాయ్ పాత్రలో సత్యదేవ్ ను కూడా అనుకుంటున్నట్టు పలు కథనాలు వచ్చాయి. మరి ఇలాంటి కీలక పాత్రల్లో ఎవరు నటించే అవకాశం దక్కించుకున్నారో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: