క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్“మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. కిక్ బాక్సర్ గా కనిపించడానికి విజయ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ మేకోవర్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న “లైగర్” మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా విజయ్ సోషల్ మీడియా వేదికగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు వెల్లడించారు.”మీ అబ్బాయి తిరిగి వచ్చాడు – వర్క్ ఫ్రమ్ హోమ్. విషయాలను కదిలిద్దాం” అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. ఓ ఫోటోని షేర్ చేశారు. ఇందులో విజయ్ మైక్ ముందు నిలబడి ఒక చేతిలో కాపీ కప్ పట్టుకొని.. మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని చదువుతున్నాడు. దీనిని బట్టి యంగ్ హీరో ఇంటి వద్ద నుంచే డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసినట్లు సమాచారం.ఏదేమైనా విజయ్ మళ్ళీ వర్క్ లోకి దిగానని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. “లైగర్” మూవీ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “లైగర్” ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ నటుడు జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ వర్క్ “లైగర్” కోసం యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేయడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: